మహేష్ బాబు చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్స్.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్..

మహేష్ బాబు (Twitter/Mahesh Babu)

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అవును మహేష్ బాబు ఈ మధ్యకాలంలో చాలా ఛేంజ్ అయ్యాడు.

  • Share this:
    అవును సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన పనిని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అవును మహేష్ బాబు ఈ మధ్యకాలంలో చాలా ఛేంజ్ అయ్యాడు. ఒకప్పుడు అంతగా పబ్లిక్‌తో కానీ అభిమానులతో కానీ ఇంట్రాక్ట్ కానీ మహేష్ బాబు ఇపుడు తన మనసులో మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. తాజాగా మహేష్ బాబు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కరోనా వైరస్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బతో చైనాతో పాటు భారత్ సహా అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు దేశాలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం పడకేసింది. కరోనా వైరస్ కారణంగా చైనా ఆర్ధిక వృద్ధి మందగించింది. ఈ మందగమనం మన దేశాన్నికూడా తాకింది. తాజాగా ఈ వైరస్.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యవరస ఆరోగ్య ఎమర్జన్సీ ప్రకటించింది. ఈ వైరస్ ఎఫెక్ట్ కారణంగా నటీనటులతో పాటు రాజకీయ నాయకులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు కరోనా వైరస్ పై ట్వీట్ చేసాడు. ఈ వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదు. కాస్తంత పరిశ్రుభత మెయింటెన్ చేస్తే చాలు అన్నారు. దాంతో కరోనా వైరస్ వచ్చినపుడు ఏం చేయాలి ? ఏం చేయకూడదనే విషయాలకు సంబంధించిన జాగ్రత్తలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో అభిమానులకు షేర్ చేసాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: