హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

స్టాక్ మార్కెట్లు మళ్లీ ఢమాల్... కూల్చేస్తున్న కరోనా వైరస్...

స్టాక్ మార్కెట్లు మళ్లీ ఢమాల్... కూల్చేస్తున్న కరోనా వైరస్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Stock Markets : గత వీకెండ్‌లో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు... సోమవారం మళ్లీ నష్టాలతో ప్రారంభం కావడం... దేశ ఆర్థిక వ్యవస్థకు సమస్యే.

Stock Markets : కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా కనిపిస్తోంది. మన దేశాన్నే తీసుకుంటే... స్టాక్ మార్కెట్లు మాటిమాటికీ నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయి... ఆ తర్వాత కూడా మరింత భారీ నష్టాలతో 32వేల మార్క్ దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 500 పాయింట్లు నష్టపోయి... 9వేల పాయింట్ల దగ్గర కదలాడుతోంది. ఇప్పటికే దేశంలో పారిశ్రామిక, సేవా రంగాలు కుదేలవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, పార్కులు, పబ్బులు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. అలాగే... పర్యాటక రంగం విపరీతంగా దెబ్బతింది. పర్యాటక కేంద్రాలకు టూరిస్టులు వెళ్లట్లేదు. అలాగే... సాఫ్ట్‌వేర్ కంపెనీలు... వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తేవడంతో... పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తగ్గిపోయింది. ఇక ప్రయాణాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పడంతో... చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు. తప్పనిసరైతే తప్ప బయటకు రావట్లేదు. ఇలా ఎక్కడికక్కడ స్థబ్దత రావడంతో... ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతోంది. ఉత్పాదక శక్తి తగ్గిపోతోంది. డిమాండ్ కూడా పడిపోతోంది. ఇవన్నీ పారిశ్రామిక రంగాన్ని పతనంవైపు నడిపిస్తున్నాయి.

దేశంలో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య పెరుగుతుంటే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇన్వెస్టర్లు చాలా భయపడుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే టెన్షన్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతుండటం కూడా స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలకు కారణం అవుతున్నాయి.

First published:

Tags: Coronavirus, Covid-19, Sensex, Stock Market

ఉత్తమ కథలు