Covid ex gratia: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు..ఎలా పొందాలో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Corona ex gratia: భవిష్యత్తులో కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని పత్రాలు సమర్పించిన 30 రోజుల్లోగా సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమవుతుంది.

 • Share this:
  కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. అన్ని దేశాల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా దెబ్బకు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు... పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతో మంది అనాథలుగా మారిపోయారు. ఇప్పుడు వారి పరిస్థితేంటి? వారికి దిక్కెవరు? అని చర్చ జరుగుతున్న వేళ.. కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ.50 పరిహారం చెల్లిస్తామని వెల్లడించింది. వారికి రూ.50 వేలు పరిహారంగా చెల్లించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయాన్ని.. బుధవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

  కరోనా మృతుల కుటుంబాలకు ఇచ్చే ఈ పరిహారాన్ని రాష్ట్రాలు అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. కోవిడ్ సహాయ చర్యలలో పాల్గొన్నవారు, కోవిడ్‌ సన్నద్ధ చర్యలలో పాల్గొన్నవారు ఎవరైనా ఈ వైరస్ సోకి మరణిస్తే ... అందరిలాగే వారికి కూడా పరిహారం వర్తిస్తుందని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఈ పరిహారం పొందాలంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికెట్ ఉండాలి. కరోనాతోనే మరణించినట్లుగా ధృవపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే పరిహారం ఇస్తారు. ఒకవేళ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఏడాది సెప్టెంబరు 3న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తారు.

  నీట్ ఎగ్జామ్ లో భారీ కుంభకోణం.. రూ. 50 లక్షలిస్తే పరీక్ష రాయకున్నా సీటు..

  రాష్ట్రాల విపత్తు ప్రతిస్పందన నిధి(SDRF) నిధి నుంచి ఈ చెల్లింపులు చేస్తారని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది కేంద్రం. SDRF విడుదల చేసే పరిహారం నిధులను జిల్లాల విపత్తు నిర్వహణ సంస్థలు(DDMA) ద్వారా బాధితుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తారు. 2020లో దేశంలో తొలి కోవిడ్ మరణం నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారంతా దీనికి అర్హులే. భవిష్యత్తులో కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఈ పరిహారం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

  ఆ మృతదేహం నా కొడుకుదే.. ఆర్మీ జవాన్ తండ్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

  కోవిడ్ మృతుల కుటుంబాలు పరిహారం పొందాలంటే ముందు డెత్ సర్టిఫికెట్ ఉండాలి. క్లెయిం ఫారానికి జత చేసే మరణ ధ్రువీకరణ పత్రంలో ఆ వ్యక్తి కరోనా వల్లే మరణించాడని ఉండాలి. ఐతే కోవిడ్ మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి జిల్లాల స్థాయిలో కమిటీలను నియమించాలని ఎన్‌డీఎంఏ సూచించింది. ఇందులో అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా వైద్య కళాశాల ప్రిన్సిపల్ లేదా హెచ్‌వోడీ, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ సభ్యులుగా ఉంటారు. వచ్చిన దరఖాస్తులపై.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌లు సంయుక్తంగా విడుదల చేసిన సెప్టెంబరు 3 నాటి మార్గదర్శకాల ప్రకారం ఈ కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి.

  ఢిల్లీ రెస్టారెంట్​ నిర్వాకం.. చీర కట్టుకుందని మహిళకు నో ఎంట్రీ.. నెటిజన్ల ఆగ్రహం

  భవిష్యత్తులో కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని పత్రాలు సమర్పించిన 30 రోజుల్లోగా సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. బాధితులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, కావాల్సిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తైన తర్వాత సంబంధిత వ్యక్తుల ఖాతాలకు ఎస్డీఆర్ఎఫ్ నుంచి రూ.50వేలు జమ అవుతాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: