స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI లోన్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలను మరో మూడు నెలలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గతంలో మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి మారటోరియం మార్చి 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. ఇటీవల మరో మూడు నెలలు మారటోరియం కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. అంటే జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు రెండో మారటోరియం ఉంటుంది. మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం ఆరు నెలలు మారటోరియం ఎంచుకోవచ్చు. అయితే మారటోరియం కొనసాగింపుపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI టర్మ్ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం కొనసాగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
ఈఎంఐ మారటోరియం ప్రక్రియను బ్యాంకు సులభతరం చేసింది. సుమారు 85 లక్షల మంది లోన్ కస్టమర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తోంది. ఖాతాదారులు ఎస్బీఐ సూచించిన ఫోన్ నెంబర్‌కు YES అని మెసేజ్ పంపిస్తే చాలు. ఈఎంఐలు వాయిదా వేయాలనుకుంటే బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వచ్చిన ఐదు రోజుల్లో ఎస్ఎంఎస్ పంపాలి.
ఇవి కూడా చదవండి:
SBI Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల డబ్బులు చేతికొస్తాయి
SBI: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి ఎస్బీఐ షాక్
Job Loss: ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పొందండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Corona, Corona virus, Coronavirus, Covid-19, Home loan, Housing Loans, Lockdown, Personal Loan, Rbi, Reserve Bank of India, Sbi, State bank of india