Krishnapatnam: ఆనందయ్య మందుపై ఆయుష్ వైద్యుల కీలక వ్యాఖ్యలు.. సీఎం జగన్ ఏమన్నారంటే..!

ఆనందయ్య (ఫైల్)

ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే మందుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

 • Share this:
  ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే మందుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మందును పరీక్షించి శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఐతే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేవరకు మందు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్యను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే గాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆనందయ్య ఇచ్చే మందుపై చర్చ జరిగింది. సమావేశానికి హాజరైన రాష్ట్ర ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. ముందు తయారు చేస్తున్న విధానం, వినియోగిస్తున్న మూలికలు, లాభనష్టాలు, తదితర అంశాలపై చర్చించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య 30-35 ఏళ్లుగా మందు అందిస్తున్నారని.. ఆయన వాడే మూలికలు ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కావన్నారు. నోటి ద్వారా నాలుగు రకాల మందులు, కళ్లలో డ్రాప్స్‌ ఇలా ఐదు రకాలుగా మందులు ఇస్తున్నట్లు వివరించారు.

  మొత్తం ఐదురకాల మందుల తయారీలో 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యంగా పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య వినియోగిస్తున్నట్లు తెలిపారు. అన్నీ కూడా సహజంగా దొరికే పదార్థాలేనని.. కృత్రిమంగా తయారు చేసిన వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదని స్పష్టం చేశారు. మందుల తయారీ విధానాన్ని మొత్తం ఆనందయ్య తమకు చూపించారని.. ఫార్ములా కూడా వివరించారని సీఎంకు వివరించారు. మందులకు సంబంధించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపామన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు సంబంధించిన వివరాలు రాగా.. మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

  ఇది చదవండి: రైల్వే జాబ్ లో చేరేందుకు ఆపాయింట్ మెంట్ లెటర్ తీసుకెళ్లిన కుర్రాడు.. కానీ అక్కడికెళ్లాక అంతా షాక్..  అలాగే ఈ మందు శాంపిళ్లను ‘సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ స్టడీస్‌’ (సీసీఆర్‌ఏఎస్‌)కు పంపినట్లు రాష్ట్ర ఆయుష్ కమిషనర్ వివరించారు. వాళ్లు 500 మందికి ఇచ్చి వారి నుంచి పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నారని వెల్లడించారు. కాగా, ఈ మందు వినియోగం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందన్ని సమావేశంలో అభిప్రాయపడ్డారు. మరో 6–7 రోజుల్లో నివేదిక వస్తుందని సమావేశంలో అధికారుల వెల్లడించారు.

  ఇది చదవండి: ఇరగదీసిన నెల్లూరు కుర్రాళ్లు.. వకీల్ సాబ్ ని దించేశారుగా..!  ఇక ఆనందయ్య.. రోగుల కంట్లో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలన్న సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు టీటీడీ ఆయుర్వేద వైద్యులు కూడా కృష్ణపట్నం మందును తయారు చేసేందుకు ముందుకొచ్చారు.
  Published by:Purna Chandra
  First published: