కరోనాతో ట్రంప్ స్నేహితుడు మృతి.. వైరస్‌తో పోరాడి ఓడిపోయారు..

న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా స్టాన్లీ చెరాకు అమెరికాలో పేరుంది. క్రౌన్ అక్విసిషన్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన స్టాన్లీ న్యూయార్క్ నగరంలో ఎన్నో భారీ భవంతులను నిర్మించారు.

news18-telugu
Updated: April 13, 2020, 4:04 PM IST
కరోనాతో ట్రంప్ స్నేహితుడు మృతి.. వైరస్‌తో పోరాడి ఓడిపోయారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనా రక్కసి విజృంభణతో అమెరికా కకావికలమవుతోంది. న్యూయార్క్ సహా పలు నగరాల్లో జనం పిట్టల్లారాలుతున్నారు. సామాన్య ప్రజల నుంచి నటులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు సైతం మృత్యువాతపడుతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది కోవిడ్ మహమ్మారి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు సైతం కరోనాకు బలయ్యాడు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ దిగ్గజం స్టాన్లీ చెరా(78) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆయన తుదిశ్వాస విడినట్లు ఆదివారం అమెరికా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా స్టాన్లీ చెరాకు అమెరికాలో పేరుంది. క్రౌన్ అక్విసిషన్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన స్టాన్లీ న్యూయార్క్ నగరంలో ఎన్నో భారీ భవంతులను నిర్మించారు. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఆయన ఏటా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. 2016 నుంచి 2019 వరకు 402,800 అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఆర్ధికంగా అండదండగా ఉన్నారు స్టాన్లీ. అంతేకాదు ట్రంప్ అల్లుడు, వైట్‌టౌట్ సలహాదారు కుష్నర్‌తోనూ స్టాన్లీకీ వ్యాపార సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది న్యూయార్క్‌లో జరిగిన వెటరన్స్ డే పరేడ్‌లోనూ స్టాన్లీని తన ప్రాణ స్నేహితుడంటూ ట్రంప్ పరిచయం చేశారు ట్రంప్. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో తన స్నేహితుడికి కరోనా సోకిందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోవడంతో ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 5,60,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో పోరాడి 32,634 కోలుకోగా.. మరో 22,115 మంది చనిపోయారు. అమెరికాలో ప్రస్తుతం 5,05,684 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 11,766 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క న్యూయార్క్ నగరంలోనే 98వేలకు పైగా మంది బాధితులున్నారు. అక్కడ ఇప్పటి వరకు 6,400 మంది చనిపోయారు.
Published by: Shiva Kumar Addula
First published: April 13, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading