మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

ఏపీలోని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరోనా బారిన పడ్డారు.

news18-telugu
Updated: July 17, 2020, 6:37 PM IST
మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలామంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్ 19 సోకగా... తాజాగా ఈ జాబితాలోకి శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా చేరిపోయారు. ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా... కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని పార్టీ శ్రేణులు, నేతలకు సూచించారు. ఏపీలో ఇప్పటివరకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాసులు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కరోనా బారిన పడ్డారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఏపీలో ఉన్న వారికి 2592, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరిలో కరోనా సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో అత్యధికంగా 24 గంటల్లోనే 634 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత గుంటూరులో 367, చిత్తూరు 328, కర్నూలు 315 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురంలో 297, శ్రీకాకుళం 149, నెల్లూరు 127, పశ్చిమ గోదావరి 109, విజయనగరం 89, కడప 55, ప్రకాశం 53, కృష్ణా 37, విశాఖపట్నం జిల్లాలో 23 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading