Corona Vaccine: హైదరాబాద్‌కు చేరిన రష్యా కరోనా వ్యాక్సిన్..

కరోనాను నివారణ కోసం రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ (Sputnik V vaccine) భారత్‌కు చేరింది.

news18-telugu
Updated: November 13, 2020, 7:26 AM IST
Corona Vaccine: హైదరాబాద్‌కు చేరిన రష్యా కరోనా వ్యాక్సిన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనాను నివారణ కోసం రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ (Sputnik V vaccine) భారత్‌కు చేరింది. హైదరాబాద్‌లో ఆ వ్యాక్సిన్ రెండు, మూడు విడతల క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. వీటిని ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్వహించనుంది. ఈ మేరకు రెడ్డీస్ ల్యాబ్, రష్యా డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్డీఐఎఫ్​)ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక, రష్యా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు రెడ్డీస్ ల్యాబ్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించినట్టుగా సమాచారం. భారత్‌లో రష్యా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ కోసం ఇప్పటికే వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్టుగా సమాచారం. ఈనెల 15 నుంచి రెడ్డీస్ ల్యాబ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించి... అనంతరం ట్రయల్స్‌ రిజల్ట్‌ను డీజీసీఐకి సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది

ఈ ఏడాది సెప్టెంబరులో డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్‌ల మధ్య భారతదేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ క్లినికల్ క్లినికల్ ట్రయల్స్ పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి ఆర్డీఐఎఫ్ 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది.

ఇక, కరోనాపై పోరులో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 92శాతం సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని, ప్రజలను కోవిడ్ (covid) బారిన పడకుండా కాపాడుతున్నట్లు ప్రకటన వెలువడటం విశేషం. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల ఆధారంగా మధ్యంతర ఫలితాలను ప్రకటించిన మాస్కో ఈ డ్రగ్ విషయంలో ఇతర దేశాల చూపును తనవైపు తిప్పుకుంది. మొత్తానికి రష్యా చేసిన ఈ తాజా ప్రకటనతో కరోనా టీకా రేసులో (corona vaccine race) తాము కూడా ఉన్నట్టు ప్రపంచానికి తేల్చి చెప్పింది.
Published by: Sumanth Kanukula
First published: November 13, 2020, 7:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading