హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Sputnik Light: భారత్‌లో రెండో సింగిల్ డోసు Covid టీకా -ఎమర్జెన్సీ వాడకానికి DCGI అనుమతి

Sputnik Light: భారత్‌లో రెండో సింగిల్ డోసు Covid టీకా -ఎమర్జెన్సీ వాడకానికి DCGI అనుమతి

స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్

స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్

భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది.

కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ కీలక మైలురాళ్లను దాటుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడినవారిలో 75 శాతం మందికి తొలి డోసు టీకాలు అందగా, నూరు శాతం లక్ష్యం దిశగా కార్యాచరణ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని ఇంకాస్త పెంచుతూ కేంద్రం మరో టీకాకు ఆమోదముద్ర వేసింది. భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశంలో స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది.

రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్ రెండు డోసులది కాగా, స్పుత్నిక్ లైట్ మాత్రం సింగిల్ డోస్ టీకా. కేంద్రం గత ఆగస్టులో జాన్సన్ అండ్ జాన్సన్ వారి సింగిల్ డోసు టీకాకు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు మరో సింగిల్ డోసు టీకా పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. కాగా, స్పుత్నిక్ లైట్ టీకాను అత్యవసర వినియోగానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది.

Pawan Kalyan కోసం ఎగబడ్డ జనం -సమతామూర్తి సందర్శన.. చినజీయర్ ఆశీస్సులు -జనసేనాని కీలక ప్రసంగం


స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ రాకతో భారత్ లో పంపిణీ అవుతోన్న కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 9కి పెరిగింది. ఈ కొత్త వ్యాక్సిన్ చేరికతో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత బలోపేతం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. డ్రగ్ రెగ్యులేటర్ DCGI (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) దేశంలో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

No Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు -ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాల్సిందే: కేంద్రం ఆదేశాలుకేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,07,474 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,21,88,138కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,25,011కి తగ్గాయి. కేసులు తగ్గిన మరణాలు మాత్రం భారీగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 865 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా కరోనాకు బలైపోయినవారి సంఖ్య 5,01,979కి చేరుకుంది. దేశంలో ఇప్పటిదాకా దాదాపు 170 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

First published:

Tags: Covid, Covid vaccine, Health minister, Sputnik-V