హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Lockdown in AP: ఏపీలో రెండు వారాల తర్వాత లాక్ డౌన్ పై క్లారిటీ..? సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ అదేనా..?

Lockdown in AP: ఏపీలో రెండు వారాల తర్వాత లాక్ డౌన్ పై క్లారిటీ..? సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ అదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు పరిస్థితిని లాక్ డౌన్ వైపుకు తీసుకెళ్తున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ లో చూస్తుండగానే కరోనా యాక్టివ్ కేసులు 40వేలు దాటేశాయి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కేవలం 10 రోజుల్లో 90శాతానికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వం ఎంత చెప్తున్నా.. ప్రజల్లో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాస్క్, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాజకీయ సభలు, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, ఆలయాలు, బహిరంగ మార్కెట్లు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారాయి. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుచోట్ల వర్తక సంఘాలు దుకాణాలు తెరిచే అంశంపై స్వీయ ఆంక్షలు విధించుకున్నారు. నిర్ణీత సమయంలోనే షాపులు తెరుస్తామని ప్రకటించారు. విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే షాపులు తెరుస్తారు. ఆదివారం అంతా బంద్ చేస్తామని ప్రకటించారు.

  కరోనా సెకండ్ వేవ్ లో వచ్చే నాలుగు నుంచి ఆరువారాల సమయం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ ఆరు వారాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైతే తప్ప బయకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇప్పటివరకు దగ్గు, తుమ్ముల వల్లే ప్రధానంగా కరోనా వ్యాపిస్తుందని అందరూ భావించినా.. ఎదుటివ్యక్తితో మాట్లాడినప్పుడు వచ్చే గాలి, నీటి తుంపర్ల వల్ల కూడా వైరస్ సోకుతుందని తేల్చారు. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో లాక్ డౌన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..? నైట్ కర్ఫ్యూకి డేట్ ఫిక్స్..?


  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల పాటు ఆంక్షలు విధించి.. ఆ తర్వాత ఫలితం లేకుండా కొన్ని సడలింపులతో కూడిన లాక్ డౌన్ విధించాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. రెండు వారాల నైట్ కర్ఫ్యూ అనంతరం కేసుల సంఖ్య తగ్గకపోతే మే 2వ తేదీ లేదా అదే నెల మొదటివారంలో లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐతే  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

  ఇది చదవండి: ఏపీలో వ్యాక్సిన్ లేటెస్ట్ రిపోర్ట్.. ఏ జిల్లాలో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయంటే..!  ఇప్పటికే రాష్ట్ర సచివాలయంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పశ్చిమగోదావరి మినహా అన్ని జిల్లాల్లో రోజుకి సగటున 500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కఠిన ఆంక్షలు విధించకుంటే పరిస్థితి చేయిదాటే అవకాశముందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది.. నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఓపికి పట్టాల్సిందే..!

  ఇది చదవండి: రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రోజా... వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న వైసీపీ ఫైర్ బ్రాండ్

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Lockdown

  ఉత్తమ కథలు