గుంటూరులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఉన్న నియంత్రణా చర్యలతో పాటు కొత్తగా ఎటువంటి చర్యలు చేపట్టారని మంత్రి ఆరా తీశారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి రెడ్ జోన్కు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాలో మొత్తం 177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. గుంటూరులో రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్లలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గుంటూరు లో 37 క్వారెంటైన్ సెంటర్లలో 5,177 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని... ఇప్పటివరకు క్వారంటైన్ సెంటర్ల నుండి 337 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
రెడ్ జోన్లలో పూర్తి స్థాయి రెస్ట్రిక్షన్స్లో ఉంచడంతో పాటు...గ్రీన్ జోన్లను ప్రొటెక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నామని వివరించారు. గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ పఠిష్టంగా అమలు పరిచేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తోందని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఒక మండలానికి..మరొక మండలానికి రాకపోకలు లేకుండా ముళ్ల కంచెలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. GGHలో 26 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని... 427 ICU బెడ్స్ ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ రివ్యూ మీటింగ్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, కలెక్టర్ శ్యామ్యుల్ ఆనంద్, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Nani, Andhra Pradesh, Coronavirus, Guntur