ప్రతి ఆదివారం అందరూ ఖచ్చితంగా ఇలా పాటించాలి...పోచారం శ్రీనివాస రెడ్డి

పరిశుభ్రంగా ఉంటే సీజన్లో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.

అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి తన నివాసంలోని పూల కుండీలలో చెత్తను తొలగించి తాజా నీటితో నింపారు.

  • Share this:
    సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం-పది గంటలకు-పదినిమిషాలు” కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి తన నివాసంలోని పూల కుండీలలో చెత్తను తొలగించి తాజా నీటితో నింపారు.
    ఈ సందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ..మానవుల ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చదనం, పరిశుభ్రత అత్యంత ప్రాముఖ్యమైనవి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన అన్నారు. పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కే టి రామారావు గారికి నా అభినందనలు. పరిశుభ్రంగా ఉంటే సీజన్ లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. ఇదొక మంచి అవకాశం, పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తమ ఆరోగ్యం కోసం వారంలో పది నిమిషాలు కెటాయించడం పెద్ద ఇబ్బంది కాదు అని స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. జబ్బులు వచ్చిన తరువాత లక్షలు ఖర్చు చేయడం కన్నా ముందస్తు శుభ్రతతో నివారించవచ్చు, దీన్నొక సామాజిక కార్యక్రమంగా అందరూ భావించి ప్రతి ఆదివారం ఖచ్చితంగా పాటించాలని విజ్షప్తి చేస్తున్నాను అన్నారు.
    Published by:Venu Gopal
    First published: