ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ..రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్...

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు...

  • Share this:
    కామారెడ్డి జిల్లా:  ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా యువత రక్తదానం చేయడం అభినందనీయమని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ... కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్ లో యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు... ఈ కార్యక్రమంలో స్పీకర్ తోపాటు జహీరాబాద్ ఎంపీ బిబీ పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘం అధ్యక్షుడు జంగం గంగాధర్, జిల్లా జాయంట్ కలెక్టర్ యాదిరెడ్డి తదితరులు హాజరయ్యారు.. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువర్స్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. రక్తం దానం చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువకులను అభినందిస్తున్నాను.
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో డెలీవరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాన్సువాడ ప్రాంతంలోని గర్భిణీలు, శిశువుల కోసం పట్టణంలో ప్రత్యేకంగా 100 పడకలతో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు..బాన్సువాడ ప్రాంత ప్రజల కోసం కోటి రూపాయలతో నూతన బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశామన్నారు..
    Published by:Venu Gopal
    First published: