హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

SP Balu Health | ఎస్పీ బాలు అభిమానులకు చేదువార్త.. ఆయన భార్యకు కరోనా...

SP Balu Health | ఎస్పీ బాలు అభిమానులకు చేదువార్త.. ఆయన భార్యకు కరోనా...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి దంపతులు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి దంపతులు

ఎస్పీ బాలసుబ్రమణ్యం భార్య ఎస్పీ సావిత్రి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

  ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిమానులకు మరో చేదువార్త. బాలసుబ్రమణ్యం భార్య ఎస్పీ సావిత్రి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎస్పీ బాలు ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి పరవాలేదని, వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకుని ఇంటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న సమయంలో బాలు భార్య సావిత్రికి కూడా కరోనా వచ్చిందనే వార్త ఫ్యాన్స్‌ను మరింత ఆందోళనకు గురి చేసేలా ఉంది. బాలు ఆరోగ్యం కుదుటపడాలంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. తిరుమలలో కొందరు బాలు ఆరోగ్యం కోసం వెంకన్నకు కొబ్బరికాయలు కొట్టి తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకునేలా చూడాలని ప్రార్థించారు.

  ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ...ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉందన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని..ఇది ఊరటనిచ్చే వార్త గా పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎస్పీబీ ఎంతో సన్నిహితులని.. వారు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  బాలుకి కరోనా పాజిటివ్ అని తెలిసి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీని ఉద్దేశించి ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘బాలూ త్వరగా లేచిరా...నీకోసం వేచున్నా...’అంటూ ఇళయరాజా బొంగరుబోయిన స్వరంతో పిలుపునిచ్చారు. మన జీవితం సినిమాతో మొదలైనది కాదని...సినిమాతో ముగిసిపోయేదీ కాదని వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య స్నేహ బంధం సినిమాలకు ముందు నిర్వహించిన మ్యూజికల్ కచేరీల కాలం నుంచే మొదలైయ్యిందని గుర్తుచేశారు. సంగీతం ఇద్దరికీ జీవితం, జీవనోపాధి అయ్యిందన్నారు. గాత్రం, సంగీతం ఒకటిచేరినట్లే...మన ఇద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాంటిదేనన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Coronavirus, SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు