Omicron surge in South Korea : కోవిడ్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మల్లీ అలజడి రేగింది. పలు దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దక్షిణ కొరియాలోనూ కొవిడ్ కేసులతో పాటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేగంగా వ్యాపస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణకొరియాలో గడిచిన ఏడు రోజులుగా సగటున 3,37,000 కేసులు నమోదవడంతోఅక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దక్షిణకొరియాలో మంగళవారం ఒక్కరోజే 3,62,283 కరోనా కేసులు, 293 మరణాలు నమోదయ్యాయి. కరోనావ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణకొరియాలో అత్యధిక మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. దక్షిణకొరియాలో మొత్తం కేసుల సంఖ్య 72 లక్షలకు చేరింది.
అయితే మరో 1196 మంది కోవిడ్ పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు దక్షిణకొరియా అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు ఇలాగే కొనసాగితే హాస్పిటల్ లో చేరేవారి సంఖ్య పెరిగి రాబోయే వారాల్లో ఆసుపత్రి వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసీయూల్లో 30 శాతం కంటే ఎక్కువ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని...అయినప్పటికీ వైద్య మౌలిక సదుపాయాలు విస్తరించే పనిలో ఉన్నట్లు దక్షిణకొరియా అధికారులు తెలిపారు. దేశంలో 62 శాతం మందికి బూస్టర్ డోసు టీకా అందించినట్లు అధికారులు తెలిపారు.
ALSO READ Elon Musk-Putin : పుతిన్ కు ఎలాన్ మస్క్ మరో సవాల్
మరోవైపు,కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జీరో కొవిడ్ విధానంతో కఠిన లాక్ డౌన్ లు విధించి కరోనాను అదుపులోకి తెచ్చిన చైనాకు ప్రస్తుతం స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. చైనాలో సోమవారం కంటే మంగళవారం రెట్టింపు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం చైనాలో 3,507 కేసులు వెలుగుచూసినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్లోనే(2,601) వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం కంటే 1,337 కేసులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో చైనాలో రోజువారీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఫలితంగా పలు నగరాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పెద్ద నగరాలైన జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్ చున్, హంకాంగ్ తో సరిహద్దు నగరంషెన్ జెన్ సహా పలు నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది జిన్ పింగ్ ప్రభుత్వం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona deaths, Covid -19 pandemic, South korea