Home /News /coronavirus-latest-news /

SOUTH KOREA HITS 4 LAKH CASES A DAY PVN

Coronavirus : దక్షిణ కొరియాలో కరోనా సునామీ..ఒక్కరోజే 4లక్షల కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid-19 : చైనా, తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ సూచించారు.

Covid Cases In South Korea : కోవిడ్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మల్లీ అలజడి రేగింది. పలు దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్​ దడపుట్టిస్తోంది. కొవిడ్‌ భయాలతో చైనాలోని చాంగ్‌చున్‌, షెన్‌జెన్‌ సహా పలు ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దాదాపు మూడు కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. చైనాలో బుధవారం 3,290 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు దక్షిణకొరియాలోనూ కరోనా బుసలు కొడుతుంది. దక్షిణ కొరియాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొవిడ్​ కేసులతో పాటు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేగంగా వ్యాపస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణకొరియాలో బుధవారం ఒక్కరోజే 4,00,741 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రాజధాని సియోల్‌ నగరం పరిధిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన 4 లక్షల మందిలో 81,395 మంది సియోల్‌ వాసులే. బుధవారం 164 మంది కరోనాతో మృతి చెందారు.

దక్షిణ కొరియాలో వారం రోజులుగా రోజూ సగటున 3 లక్షల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే దక్షిణ కొరియాలో 23.58 లక్షల కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోని 87.5 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తవగా, 62.7 శాతం జనాభాకు టీకా బూస్టర్‌ డోసులు కూడా వేశారు. మరోవైపు,హాంకాంగ్‌లోనూ 29,272 కొత్త కేసులు నమోదవగా, 228 మంది కొవిడ్‌తో చనిపోయారు. అయితే కొవిడ్‌ మృతుల్లో ఎక్కువమంది టీకా తీసుకోని వృద్ధులేనని హాంకాంగ్‌ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక, వియత్నాంలో కూడా కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. వియత్నాంలో గడిచిన వారంలో 18 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. చైనా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాల్లో మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియంట్‌ కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ALSO READ North Korea : మరో మిసైల్ ప్రయోగించిన కిమ్..అయితే క్షణాల్లోనే..

చైనా, తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ సూచించారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్న నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ స్థితిగతులు, వ్యాక్సినేషన్‌ తీరు తెన్నులపై ఆయన బుధవారం సమీక్షించారు. జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ను పెంచాలని అధికారులకు మాండవీయ సూచించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Coronavirus, Covid -19 pandemic, Covid cases, South korea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు