తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా... ఆ దేశంలో కొత్త టెన్షన్

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా... ఆ దేశంలో కొత్త టెన్షన్

ప్రతీకాత్మక చిత్రం

South Korea: కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టిన దక్షిణ కొరియా.. గత కొన్నిరోజులుగా కేసులు నమోదు కాకపోవడం, మరణాలు లేకపోవడంతో బార్లు, క్లబ్బులకు సైతం అనుమతి ఇచ్చింది.

 • Share this:
  కరోనా వైరస్ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలను కూడా గడగడలాస్తున్న సంగతి తెలిసిందే. చైనా తరువాత కరోనా వ్యాప్తిని చవిచూసిన దక్షిణ కొరియా... ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో అందరికంటే ముందుగానే సక్సెస్ సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు ఓ రోల్ మోడల్’గా కూడా నిలిచింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టిన దక్షిణ కొరియా.. గత కొన్నిరోజులుగా కేసులు నమోదు కాకపోవడం, మరణాలు లేకపోవడంతో బార్లు, క్లబ్బులకు సైతం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా వైరస్‌ రెండోసారి తన ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

  నైట్‌క్లబ్‌లకు వెళ్లినవారిలో కొవిడ్‌-19 కు గురైనవారి సంఖ్య శనివారానికి 40కి చేరుకుంది. ఈ సంఖ్య మరింత ఎక్కువ కాకుండా ఉండేందుకు సియోల్‌ సిటీ మేయర్‌ పార్క్‌ వన్‌ సూన్‌ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నైట్‌క్లబ్బులు, డిస్కోలు, బార్లను తక్షణమే మూసేయాలని పార్క్‌ ఆదేశాలు జారీచేశారు. చైనా తర్వాత దక్షిణ కొరియాలో ఎక్కువ సంఖ్యలో జనం కరోనా వైరస్‌కు గురయ్యారు. వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరిస్తామని దక్షిణ కొరియా ప్రధానమంత్రి చుంగ్‌ సై క్యూన్‌ తెలిపారు. అయితే తమ దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందేమో అనే భయం కూడా అక్కడి ప్రజలను, పాలకులను భయటపెడుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు