Home /News /coronavirus-latest-news /

SOUTH CENTRAL RAILWAY RECRUITMENT 2020 NOTIFICATION RELEASED FOR 204 DOCTORS AND PARAMEDICAL STAFF POSTS KNOW FULL DETAILS SS

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 204 జాబ్స్... అర్హతలు, వేతనాల వివరాలివే

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 204 జాబ్స్... అర్హతలు, వేతనాల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 204 జాబ్స్... అర్హతలు, వేతనాల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

South Central Railway Recruitment 2020 | దక్షిణ మధ్య రైల్వే తాత్కాలిక పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  కరోనా వైరస్‌పై పోరాటానికి భారతీయ రైల్వే కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రైల్వే ఆస్పత్రుల్లోని పలు బ్లాక్స్‌ని కరోనా వైరస్ పేషెంట్ల కోసం సిద్ధంగా ఉంచింది. దీంతో పాటు నాన్ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్ బెడ్స్‌గా మారుతోంది. 5,000 బోగీలను 80,000 ఐసోలేషన్ బెడ్స్‌గా మారుస్తోంది. పలు జోన్లలో తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకుంటోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే 204 పారా మెడికల్ సిబ్బంది, డాక్టర్లను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరిని లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆస్పత్రిలో కోవిడ్ 19 పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన క్వారెంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో నియమించనుంది. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు 2020 ఏప్రిల్ 15 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. engcmpparamedscr@gmail.com మెయిల్ ఐడీకి లేదా 9701370624 వాట్సప్ నెంబర్‌కు దరఖాస్తులు పంపాలి. వారికి 2020 ఏప్రిల్ 18న టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మాజీ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్, పారామెడికల్ సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలో పనిచేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

  South Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలివే...


  మొత్తం ఖాళీలు- 204
  స్పెషలిస్ట్ డాక్టర్స్- 9 (జనరల్ మెడిసిన్-3, పల్మనరీ మెడిసిన్-3, అనెస్థీషియా-3)
  డీజీఎంఓ డాక్టర్స్- 34
  నర్సింగ్ సూపరింటెండెంట్-77
  ల్యాబ్ అసిస్టెంట్- 7
  హాస్పిటల్ అటెండెంట్- 77

  South Central Railway Recruitment 2020: వేతనాలు వివరాలివే...


  స్పెషలిస్ట్ డాక్టర్స్- రూ.95,000
  డీజీఎంఓ డాక్టర్స్- రూ.75,000
  నర్సింగ్ సూపరింటెండెంట్- రూ.44,900
  ల్యాబ్ అసిస్టెంట్- రూ.21,700
  హాస్పిటల్ అటెండెంట్- రూ.18,000

  South Central Railway Recruitment 2020: విద్యార్హతల వివరాలు ఇవే...


  స్పెషలిస్ట్ డాక్టర్స్- ఎంబీబీఎస్‌తో పాటు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, అనస్థీషియాలో పీజీ లేదా డిప్లొమా
  డీజీఎంఓ డాక్టర్స్- ఎంబీబీఎస్
  నర్సింగ్ సూపరింటెండెంట్- జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో 3 ఏళ్ల కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ కావాలి.
  ల్యాబ్ అసిస్టెంట్- సైన్స్ సబ్జెక్ట్‌తో 10+2 పాస్ కావడంతో పాటు డీఎంఎల్‌టీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
  హాస్పిటల్ అటెండెంట్- 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ కావాలి.

  South Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


  దరఖాస్తు ప్రారంభం- 2020 ఏప్రిల్ 11
  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 15
  టెలిఫోన్ ఇంటర్వ్యూ- 2020 ఏప్రిల్ 18

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... ఏప్రిల్ 30 లాస్ట్ డేట్

  Jobs: డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీలో జాబ్స్

  RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌కు మళ్లీ బ్రేక్
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Job notification, JOBS, Lockdown, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు