Indian Railways | Corona Lockdown | Corona Update : రైల్ బోట్ (Rail BOT) లేదా ఆర్-బోట్... అనే... రోబోను దక్షిణ మధ్య రైల్వే విభాగం అభివృద్ధి చేసింది. ఇది దాదాపు పర్సనల్ రోబో లాంటిదే. ఇది... కరోనా పోరాటంలో ఉన్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు సహాయకారిగా ఉంటంది. అంటే... మందులు అందిస్తుంది, వైద్య పరికరాలు అందిస్తుంది, కరోనా పేషెంట్లకు ఆహారం, నీరు ఇస్తుంది. అలాగే... దాని ముందు చెయ్యి పెడితే చాలు... ఇది బాడీ టెంపరేచర్ని కూడా తెలుసుకుంటుంది. ఎవరికైనా ఎక్కువ టెంపరేచర్ ఉంటే... దీనికి ఉండే ప్రత్యేక రెడ్ లైట్ వెలుగుతుంది. తద్వారా... వెంటనే అంతా అప్రమత్తమై ఆ వ్యక్తిని ఐసొలేషన్ చేయగలరు.
ఈ రోబోను వైఫై, మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చెయ్యవచ్చు. యాప్ ఓపెన్ చేసి... ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే... వాటికి తగ్గట్టుగా ఈ రోబో పనిచేస్తుంది. దీనికి పైన రియల్ టైమ్ వీడియో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా కిందికీ పైకీ, చుట్టుపక్కలకు తిరగగలదు. తద్వారా... ఈ రోబో ఎక్కడికి వెళ్తుందీ... మనం చూడగలం. పంపాలనుకున్న చోటికి దాన్ని పంపగలం. ఇది వ్యక్తులతో మాట్లాడుతుంది. వాళ్ల మాటల్ని, తన మాటల్ని రికార్డ్ చేస్తుంది.
SCR developed a RAIL BOT- #Hospital Assistant. Which can assist the hospital management in wards to provide medicines,medical accessories & serving food to the patients. It can measure body temperature. The robot can be operated by #mobileapp @RailMinIndia @drmhyb pic.twitter.com/OwsYrmsCra
— SouthCentralRailway (@SCRailwayIndia) May 16, 2020
ఇందులో నైట్ ల్యాంప్, నైట్ విజన్ కెమెరాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇది కరెంటు లేని ప్రదేశాల్లో కూడా సేవలు అందించగలదు. గంటకు 1 కిలోమీటర్ వేగంతో వెళ్తూ... త్వరగా సేవలు అందించగలదు. 80 కేజీల బరువుంటే వైద్య పరికరాలు, ఆహారం, మందుల్ని మొయ్యగలదు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే... కంటిన్యూగా 7 గంటల పాటూ ఇది పనిచేస్తూనే ఉండగలదని దక్షిణ మధ్య రైల్వే విభాగం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Indian Railways, South Central Railways