Home /News /coronavirus-latest-news /

SOUTH CENTRAL RAILWAY CLARIFIES IT IS NOT OPERATING SPECIAL TRAINS FOR MIGRANT LABOUR SS

SC Railway: దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోందా? నిజమిదే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways | తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టికెట్ కౌంటర్స్, యూటీఎస్, పీఆర్ఎస్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఆపేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది.

    భారతీయ రైల్వే మే 3 వరకు అన్ని రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వలస కూలీల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోందన్న ప్రచారం రైల్వే సిబ్బందికి కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది. వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్స్‌ని భారతీయ రైల్వే ప్రకటించిందన్న ప్రచారంతో ముంబైలోని వలస కూలీలందరూ బాంద్రా రైల్వే స్టేషన్‌కు రావడం, వేలాది మంది కూలీలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం రద్దీగా మారడం కలకలం రేపింది. ఆ కూలీలను వెనక్కి పంపేందుకు పోలీసులు తిప్పలు పడాల్సి వచ్చింది. ఈ సమస్య ముంబైలోనే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా వలస కూలీల కోసం ప్రత్యేర రైళ్లు నడుపుతోందన్న ప్రచారం జరిగింది. దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే స్పందించింది. తాము ఎవరి కోసం ప్రత్యేక రైళ్లను నడపట్లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచిస్తోంది దక్షిణ మధ్య రైల్వే.


    మే 3 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ రద్దు చేసింది భారతీయ రైల్వే. రైళ్లు రద్దు చేయడం మాత్రమే కాదు అడ్వాన్స్ బుకింగ్స్‌ని కూడా నిలిపివేసింది భారతీయ రైల్వే. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టికెట్ కౌంటర్స్, యూటీఎస్, పీఆర్ఎస్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఆపేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. కాబట్టి మే 3 వరకు ప్రయాణికుల కోసం రైళ్లు నడవవు. కేవలం సరుకుల రవాణా కోసం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయి. ప్రయాణికులు భారతీయ రైల్వే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.

    ఇవి కూడా చదవండి:

    Railways: మొత్తం 39 లక్షల రైలు టికెట్ల రద్దు... రీఫండ్ విధానం ఇదే

    Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు పంపిన కేంద్రం... బ్యాలెన్స్ చెక్ చేయండిలా

    PF Balance: పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఎంత నష్టమంటే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, Corona, Corona virus, Coronavirus, Covid-19, Indian Railway, Indian Railways, Irctc, Lockdown, Railways, South Central Railways, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Train, Train tickets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు