ప్రపంచాన్ని కరోనా వైరస్ ముప్పు ఇప్పట్లో వీడేలా కనబడటం లేదు. పలు దేశాలను ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకు గురిచేస్తోంది. భారత్లో కూడా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తి కనబరచడం లేదు. ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉందోనన్న ఆందోళన చెందుతున్నారు. అందుకే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందకు జనాలు మొగ్గు చూపుతున్నారు. దీంతో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య భారీగా తగ్గింది.
కరోనా లాక్డౌన్ అనంతరం రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దసరా, దీపావళి పండగలను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా సర్వీసులను పెంచింది. గతంలో పండగల వేళ రైల్వే స్టేషన్లలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకు ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. చాలా తక్కువ ఆక్యూపెన్సీతో రైళ్లను నడపటం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే గురువారం పలు రైళ్లను రద్దు చేసింది. కాగా, కరోనాకు ముందు ఈ రైళ్లలో పెద్ద ఎత్తున జనాలు ప్రయాణించేవారు.
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలు..
విశాఖపట్నం- విజయవాడ- విశాఖపట్నం
నాందేడ్- పాన్వెల్- నాందేడ్
ధర్మాబాద్- మన్మాడ్- ధర్మాబాద్
తిరుపతి- కొల్హాపూర్- తిరుపతి
కాచిగూడ- నార్కేర్- కాచిగూడ
కాచిగూడ- అకోలా-కాచిగూడ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.