Sonu Sood: ‘అఫ్రిది’ నువ్వు రియల్ హీరో అంటూ సోనూ సూద్ ట్వీట్.. ఏం చేశాడో తెలుసా..?

మూడు నెలల జీతం విరాళంగా ఇచ్చిన అఫ్రిది

మనసు ఉండాలి కాని సాయానికి ఏదీ అడ్డుకాదు.. సోనూ సూద్ పాటిస్తున్న సూత్రం అదే.. అందుకే ఆయనకు అంత క్రేజ్ వస్తోంది. ఆయన చూపిన దారిలో ఇప్పుడు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. అయితే అందరితో రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ మాత్రం.. రియల్ హీరో అఫ్రిది అంటూ ట్వీట్ చేశారు.

  • Share this:
    సాయం కోసం మనం.. అనే సోనూ సూద్ వేసిన బాటలో ఇప్పుడు చాలా మంది నడుస్తున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్లకు.. పేదలకు తోడుగా నిలుస్తున్నారు. ఆపద సమయంలో మీకు మేం ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని తేడా లేకుండా తమ సేవలను దేశ వ్యాప్తం చేశారు. సోనూ ఒక్కరితోనే ఇది సాధ్యం కాదు కాబట్టి ఆయన ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా తన సేవలను విస్తరిస్తున్నారు. ప్రభుత్వాలు.. ఎన్నో స్వచ్చంధ సంస్థలు చేయలేని పనులను సైతం సోనూ సూద్ ఫౌండేష్ చేస్తూ వస్తోంది. ఎవరికైనా అవసరం ఉందని తెలిసినా.. కష్టాల్లో ఉన్నా ఆదుకోండి అని ఎవరైనా ట్వీట్ చేసినా.. వెంటనే ఆపద్బాంధవుల్లా నిలుస్తున్నారు. సాయం అడగడమే ఆలస్యం క్షణాల్లో వారి కష్టాలను తీర్చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఈ ఫౌండేషన్ కు మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది ఆ ఫౌండేషన్ కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చేస్తున్నారు..

    ఇటీవల ఏపీలోని నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడుకు చెందిన బొడ్డు నాగలక్ష్మి అనే ఆమె సోనూ సూద్ ఫౌండేషన్ కు తన ఐదు నెలల పెన్షన్ విరాళంగా ఇచ్చింది. దీంతో ఆమె పెద్దమనసు చూసి సోనూ సూద్ పులకించి పోయారు.. మీరే ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు అంటూ పొగుడుతూ ట్వీట్ చేశారు. లక్షలకు లక్షలకు జీతాలు తీసుకునే వారు.. భారీగా ఆదాయం ఉన్నవారు కూడా చేయలేని పని ఆమె చేసింది. యూట్యూబర్ బొడ్డు నాగలక్ష్మి తన 5 నెలల పెన్షన్ డబ్బులు.. అంటే 15 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. సోనూ సూద్ చేస్తున్న సాయంలో భాగస్వామి అయింది. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..

    ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలు నిలిపివేస్తూ ఆదేశాలు.. ఎందుకో తెలుసా?

    తాజాగా అఫ్రిది కూడా తన మూడు నెలల జీతాన్ని సోనూ సోద్ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. ఇంతకీ ఎవరీ అఫ్రిది అనుకుంటున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన అఫ్రిది నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. తాను నవడలేకపోతున్నా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం రైల్ ఇండియాలో పని చేస్తున్నా అఫ్రిది.. తన మూడు నెలల జీతాన్ని సోనూ సూద్ ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చాడు. అతడి పెద్ద మనసు చూసిన సోనూ సూద్.. మీరే రియల్ హీరో అంటూ ట్వీట్ చేశారు. ప్రమాదంలో కాలు పోగొట్టుకుని దివ్యాంగుడిగా మారిన అఫ్రిది నిజమైన హీరో అంటూ సోనూ ట్వీట్ చేశారు. ఆతడి సాయం ఎంతోమంది జీవితాల్లో నవ్వు నింపుతుందని సోనూ సూద్ భరోసా కల్పించారు..

    ఇదీ చదవండి: డాక్టర్లకు సోనూ సూద్ సూటి ప్రశ్న? అలా ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం

    చూపులేని నాగలక్ష్మి.. నడవలేని ఆఫ్రిది.. ఇలా ఎందరో తమవంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సోనూ సూద్ సేవ స్ఫూర్తిని మెచ్చి.. మరింతమంది ముందుకు వస్తే.. లక్షలాది మందికి సాయం అందుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజల కష్టాలు గట్టెక్కుతాయి..
    Published by:Nagesh Paina
    First published: