Sonu Sood: టేస్టీ టేస్టీ రోటీ.. తింటే మర్చిపోలేరు.. వైరల్ గా మారిన సోనూసూద్ తండూరి రోటీ..!

రోటిలమ్ముతున్న సోనూ సూద్

రియల్ హీరో సోనూ సూద్ రోటీ మేకర్ గా మారారు. స్వయంగా వేడి వేడి రోటీలు తయారు చేస్తూ.. అమ్ముతున్న వీడియోనూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

  • Share this:
    పరిచయం అవసరం లేని పేరు సోనూ సూద్.. కష్టం అంటూ ఎక్కడైనా వినిపిస్తే చాలు నేనున్నాను అంటూ వాలిపోతాడు. సాయం చేయనిదే నిద్ర పోడు.. అందుకే సోనూ సూద్ అంటే అంత క్రేజ్.. భారత దేశంలో ప్రధానికి సైతం లేని గుర్తింపు సొనూ సూద్ కు సొంతం. ఈ కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్న సోనూ ఇప్పటికీ తన దానాలు, దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లుతో పాటు సోషల్ మీడియా ద్వారా అడిగినవాళ్లకి అడిగినట్లుగా తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పలు వ్యాపారాలు కూడా మొదలు పెట్టాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు. ఆ మధ్య సోనూ సూద్ సూపర్ మార్కెట్ ఒకటి ఓపెన్ చేసి.. వాటి రేట్లు చెప్తూ గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మడు. దానికి సోనూసూద్ సూపర్ మార్కెట్ అని పేరు కూడా పెట్టి డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది.. దానికి ఎక్స్‌ట్రా ఛార్జ్ అవుతుంది.. త్వరగా ఆర్డర్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. కాగా తాజాగా పంజాబీ ధాబా కూడా ఓపెన్ చేసి అందులో స్వయంగా రోటీలు చేసి అమ్ముతున్నాడు.

    సోనూ చేసిన రోటీలు తింటే మర్చిపోలేరని.. ఒకసారి తింటే మళ్ళీ ఇంకెక్కడా తినలేరని కూడా చెప్తూ ఆ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దానికి “Roti Dal free of cost ❤️ Sonu Sood da Punjabi dhaba 🇮🇳 #supportsmallbusiness #support”అని క్యాషన్ పెట్టిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తుంది. చిరు వ్యాపారుల ప్రోత్సహించడంలో సోను చేపట్టిన ఈ కార్యక్రమానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. http://






    View this post on Instagram





    A post shared by Sonu Sood (@sonu_sood)






    ఇదంతా తన లాభం కోసం కాదు.. చిరు వ్యాపారులను ప్రమోట్ చేసే పనిలో భాగంగా సోనూసూద్ ఇలా వారికి ఫ్రీగా ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్ట పోయారు. పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు ఆన్ లైన్ బిజెనెస్, సూపర్ మార్కెట్లు రావడంతో.. వారికి బిజినెస్ లేకుండా అయ్యింది. అందుకే వారిని ప్రోత్సహించాలి అంటూ సోనూ సోద్ ఇలా ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు.. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది.
    Published by:Nagesh Paina
    First published: