Sonu Sood: సోనూ సూద్ సంచలన నిర్ణయం.. ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌.. ఇలా చేస్తే చాలు..

సోనూ సూద్(ఫైల్ ఫొటో)

కరోనా వేళ చాలా మందికి సాయం అందిస్తూ రియల్ అనిపించకుంటున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. తాజాగా కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఉచితంగా అందించేందుకు సోనూ సూద్ శ్రీకారం చుట్టారు.

  • Share this:
    కరోనా సమయంలో ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్తలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి వారి మనసుల్లో దేవుడిగా నిలిచారు సోనూ సూద్. కొంత మంది కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు. కొంత మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. ఇప్పుడు దేశంలో పరిచయం అవసరం లేని వ్యక్తి సోనూ సూద్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ అతడే రియల్ హీరో.

    కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా కూడా సోనూ సూద్.. సాయం అని కోరిన వారికి సాయం అందజేస్తున్నారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. చాలా మంది ఆస్పత్రులలో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ కోరత కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోనూ సూద్ ఆక్సిజన్ కోరత లేకుండా చేసేందుకు ముందడుగు వేశారు. కరోనా రోగులకు ఆక్సిజన్ కోరతను నివారించడానికి ఇప్ప‌టికే ప‌లు చోట్లు ఆక్సిజ‌న్ ప్లాంట్ల నిర్మాణం చేప‌ట్టారు.





    అయితే తాజాగా సోనూ సూద్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా దేశమంతా అందేలా చర్యలు చేపట్టారు. దేశంలో ఏ ప్రాంతంలో ఎవ‌రికి ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మైనా వెంట‌నే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆక్సిజ‌న్ కాన్సంట్రేటర్స్‌ కోసం సంబంధిత వెబ్ సైట్‌ www.umeedbysonusood.com లో వివ‌రాలు న‌మోదు చేసుకోవాల‌ని కోరారు. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఉచితంగా అందివ్వనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: