Sonu Sood: సామాన్యులకే కాదు సర్కార్ కు సోనూ సూద్ సాయం.. ఏపీకి ఊపిరి పోస్తున్న రియల్ హీరో

Sonu Sood: సామాన్యులకే కాదు సర్కార్ కు సోనూ సూద్ సాయం.. ఏపీకి ఊపిరి పోస్తున్న రియల్ హీరో

ఏపీ ప్రభుత్వానికి సోనూ సూద్ సాయం

సోను సూద్ మనిషి కాదు.. మనిషి రూపంలో ఉన్న దేవుడు.. ఇది అతడికి పేదలు పెట్టుకున్న పేరు. కష్టం వచ్చింది అంటే చాలు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అంటారు. సామాన్యులు, సెలబ్రిటీలే కాదు.. ఇప్పుడు సర్కార్ కు సైతం సాయం చేస్తున్నారు. ఏపీకి ఊపిరి పోసేందుకు సోనూ సిద్ధమయ్యారు.

  • Share this:
    మనసున్న మారాజు అంటే ఇకపై సోనూ సూద్ పేరే చెప్పాలి. సాయం చేయడానికి దేనికైనా సిద్ధం అంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన.. కష్టం వచ్చింది సాయం కావాళ్లన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా పూర్తి సాయం అందిస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా తన సేవలను విస్తరించారు. ఏ ప్రాంత నుంచి తనకు అభ్యర్థన వచ్చినా వెంటనే వారికి సాయం చేస్తున్నారు. అవసరం చిన్నదా పెద్దదా అని చూడకుండా వరాలు కురిపిస్తున్నారు. నిజంగా పేదల పాలిట దేవుడిలా కనిపిస్తున్నారు. నిన్నటి వరకు సామాన్యుల నుంచి సెలబ్రీటీల దాకా అందరికీ ఆపద్భాంధవుడు అవుతున్నారు. ఇప్పుడు సామాన్యులకే కాదు సార్కారుకు చేయూత ఇచ్చేందుకు ముందొకచ్చారు. అయితే సాధారణంగా ప్రభుత్వాలే అందరికీ సాయం చేయాలి.. కానీ ఆ ప్రభుత్వాలు కూడా సోనూ సూద్ సాయం కోరుకుతున్నాయి అంటే.. అతడు చేస్తున్న సేవ ఎలాంటిందో అర్థం చేసుకోవచ్చు..

    తాజాగా నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ జనరేటర్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు రియల్ హీరో. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్.. విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. హమీ ఇచ్చి ఊరుకోవడం కాం.. ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ తరలించే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    అంతకుముందు నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణమైంది. దీంతో తీవ్ర కలత చెందిన సోనూ సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లాడు. సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. దీంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు. సోనూ ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సూద్ అందిస్తున్నారని పేర్కొన్నారు.
    Published by:Nagesh Paina
    First published: