ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయానికి సోనియా గాంధీ జై కొట్టారు. కరోనా నియంత్రణకు దేశాన్ని 21 రోజుల పాటు లాక్‌డౌన్ చేస్తూ తీసుకున్న మోదీ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. కరోనాను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం తగిన విధంగా సిద్ధం కాలేదంటూ రాహుల్ విమర్శిస్తున్న తరుణంలో ఆమె వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఈ మేరకు సోనియా గాంధీ.. మోదీకి ఒక లేఖ రాశారు. లేఖలో.. ‘కరోనాను తరిమికొట్టేందుకు మీరు(మోదీ) తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రిగా చెబుతున్నా. సవాళ్లు విసురుతున్న ఈ సమయంలో దేశం కోసం, దేశ ప్రజల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టా్ల్సిన అవసరం ఉంది. నిజమైన మానవత్వం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం అవసరం. మద్దతు, సహకారం, స్ఫూర్తితో కరోనాను తరిమికొడదాం’ అని సోనియా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సోనియా కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. అయితే వారిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని, అందుకోసం వారి వ్యక్తిగత రక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్-95 మాస్కులు, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలని సూచించారు.
ప్రత్యేకంగా రిస్క్ అలవెన్స్ ఇస్తే బాగుంటుందని కూడా ఆమె సూచించారు. వైద్య బృందం తమ జీవితాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్నారని, ఈ తరుణంలో అలవెన్సులు, రక్షణ చర్యలు వారికి కాస్త ఊరటనిస్తాయని తెలిపారు. ఇలా.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించిన ఆమె.. ఆయా అంశాలపై సానుకూల దృక్పదంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.
Congress Interim President Sonia Gandhi has written to Prime Minister Narendra Modi with suggestions that the government should undertake during the lockdown period. pic.twitter.com/UJ2RFcln5L
— ANI (@ANI) March 26, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Corona, Corona virus, Coronavirus, Covid-19, Janata curfew, Lockdown, Narendra modi, Sonia Gandhi