భారత్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వాం చర్యలు తీసుకుంటున్నా.. అవి సరిపోవంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ 5 సూచనలు చేశారు. వాటిని అమలుచేస్తే.. ప్రభుత్వ ఖజానా ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు సోనియా. ఆ డబ్బుతో కరోనా కోపం ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య సదుపాయాలును కల్పించవచ్చని సూచించారు. తద్వారా కరోనా కష్టాల నుంచి బయటపడవచ్చని ప్రధాని మోదీకి ఆమో సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ సోనియాతో పాటు పలు పార్టీల అధినేతలకు ఫోన్ చేసి సలహాలు కోరారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి లేఖరాశారు సోనియా.
ఆ ఐదు సూచనలు ఇవే:.
1. రెండేళ్ల పాటు మీడియా అడ్వర్టైజ్‌మెంట్లపై నిషేధం విధించాలి. పత్రికలు, టీవీ, డిజిటల్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రకటనలను నిలిపివేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.1250 కోట్లు ప్రకటనల కోసం ఖర్చుపెడుతోంది. ప్రకటనలు ఆపేస్తే ఈ డబ్బు మిగులుతుంది.
2. రూ.20వేల కోట్లతో చేపట్టిన నూతన పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిలిపివేయాలి. ప్రస్తుత చారిత్రాత్మక పార్లమెంటులోనే కార్యకలాపాలు కొనసాగించాలి. ఆ డబ్బుతో నూతన ఆస్పత్రులు నిర్మించవచ్చు. డాక్టర్లకు PPEలు అందించవచ్చు.
3. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మినహా ఇతర బడ్జెట్ వ్యయాన్ని 30శాతం తగ్గించుకోవాలి. తద్వారా ఏటా 2.5 లక్షల కోట్లు మిగలుతాయి. వాటిని లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీల సంక్షేమం కోసం వినియోగించవచ్చు.
4. రాబోయే రోజుల్లో ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రలు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలి.
5. పీఎం కేర్స్ నిధిని మొత్తం పీఎం నేషనల్ రిలీఫ్ బండ్‌కు బదలాయించాలి. పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ఆ నిధులను ఖర్చుచేయాలి. 2019కి సంబంధించి రూ.3800 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ వద్ద ఉన్నాయి. దీనితో పాటు పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులను ఆహార భద్రత కోసం వినియోగించాలి.
Congress President and CPP Chairperson Smt. Sonia Gandhi writes to PM Modi suggesting various measures to fight the COVID-19 pandemic. pic.twitter.com/77MzCYiokl
— Congress (@INCIndia) April 7, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Pm modi, Sonia Gandhi