Andhra Pradesh: కరోనా వార్డులో తండ్రి.. ఆయన కోసం స్పీపర్ జాబ్‌లో చేరిన ఎంబీఏ చదివిన కొడుకు... కానీ విధి ఆడిన వింతనాటకంలో..

తండ్రి కోసం స్వీపర్ గా మారిన కొడుకు

ఎంబీఏ చదివాడు.. మంచి ఉద్యోగం ఉంది.. అయినా స్వీపర్ గా మారాడు. అయితే కరోనా కష్ట కాలంలో కుటుంబాన్నిపోషించుకోడానికి కాదు.. తన తండ్రిపై ఉన్న ప్రేమతో ఇలా చదివిన చదువుకి సంబంధం లేకుండా ఆ పనికి సిద్ధమయ్యాడు. కానీ అతడి ఆశయం మాత్రం నెరవేరలేదు. ఇంతకీ ఏం జరిగింది.

 • Share this:
  బిచ్చగాడు సినిమాలో అమ్మ కోసం హీరో విజయ్ ఆంటోనీ బిచ్చాగాడి అవతారం మెత్తుతాడు.. సేమ్ అలాంటి ఘటనే విశాఖలోనూ జరిగింది. నాన్నపై ఉన్న ప్రేమతో ఓ కొడుకు చేసిన పని అందరి మనసుకరిగేలా చేసింది. సాధరణంగా కరోనా సమయంలో చాలామంది బిడ్డలు తమ తల్లి దండ్రులను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మరణిస్తే అనాథల్లా రోడ్డుపైనే వదిలేస్తున్న ఘటనలు చాలానే చూశాం.. సొంత వారిని సైతం పట్టించుకున్నవారు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో కన్న తండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపరు అవతారం ఎత్తాడు. అయితే అలా మారింది కన్న తండ్రినో.. తననో పోషించుకోడానికి మాత్రం కాదు..

  కరోనా బారిన పడిన వారి దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడుతున్న రోజుల్లో.. కొవిడ్‌ బారిన పడ్డ తండ్రి బాగోగులు చూసుకోడానికి స్వీపర్ గా మారాలని అనుకున్నాడు. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. కానీ విధి మాత్రం అతడి ప్రేమపై కరణ చూపించలేదు. విధుల్లో చేరేపాటికే తండ్రి విగతజీవిగా కనిపించడంతో ఆ యువకుడి గుండె బద్దలయింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తన కన్నతండ్రిని బలి తీసుకుందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.

  బాధిత యువకుడు చెప్పిన వివరాల ప్రకారం. అక్కయ్యపాలేనికి చెందిన ఎ.మధుకిషన్‌ ఎంబీఏ చదివారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 1902 స్పందన కాల్‌సెంటర్‌లో ఏడాదిన్నరగా పని చేస్తున్నారు. మధుకిషన్‌ తండ్రి 67 ఏళ్ల సుదర్శనరావు విశ్రాంత షిప్‌యార్డు ఉద్యోగి అయ్యారు. ఆయన కొవిడ్‌ బారిన పడడంతో ఈనెల 2న విశాఖలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి కేజీహెచ్‌లో చేర్పించారు. సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ నాలుగో అంతస్తులోని ఐసీయూ పడకలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల తరువాత సుదర్శనరావు స్నానాల గదిలో పడిపోవడంతో దెబ్బతగిలి రక్తం బాగా కారిపోయింది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆయన తన కుమారులకు ఫోన్‌ చేసి చెప్పారు.

  వెంటనే దీనిపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్యులకు ఫిర్యాదు చేయడంతో దెబ్బలకు చికిత్స చేశారు. కానీ అక్కడున్న సిబ్బంది తండ్రిని పట్టించుకోవడం లేదని మధుకిషన్‌కు మదనపడ్డారు. దీంతో తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన దగ్గర ఉండాలని అనుకున్నాడు.. దీంతో బయటవారిని అనుమతించరని తెలిసి పారిశుద్ధ్య కార్మికుడిగా ఆసుపత్రిలో చేరారు. విధుల్లోకి చేరిన వెంటనే రాత్రి 9.30 గంటలకు ఆస్పత్రికి వెళ్లి.. తండ్రి చికిత్స పొందుతున్న పడక దగ్గరకు వెళ్లి చూశాడు.. కానీ అక్కడ తండ్రి కనిపించలేదు. మరుగుదొడ్డి గది వరండాలో పడిపోయి కనిపించారు.ఆ దృశ్యం చూసి కొడుకు గుండె పగిలింది. అదే వార్డులో ఉన్న ఓ వ్యక్తి వచ్చి ఆయన ఎప్పుడో చనిపోయాడని చెప్పడంతో బోరున కన్నీరు పెట్టుకున్నాడు.

  తండ్రి చూసుకుందామని స్వీపర్ గా మారినా.. ఫలితం లేకపోయింది. కళ్ల ముందు తండ్రి అలా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అయితే తన తండ్రి మరణానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆవేదన చెందాడు. ఆసుపత్రి నాలుగో ఫ్లోర్‌ సూపర్‌వైజర్‌, అక్కడి పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని ఆరోపించాడు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌, సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ఇన్‌ఛార్జి, కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు మధుకిషన్‌ ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో తన తండ్రి మరుగుదొడ్డి వరండాలో పడిపోతే ఎవరూ పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
  Published by:Nagesh Paina
  First published: