కరోనా అంబులెన్స్, పోలీస్ జీపుపై రాళ్ల దాడి.. వైద్య సిబ్బందికి గాయాలు

కరోనా అనుమానితులను అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత ఆస్పత్రికి వెళ్లే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున గుమిగూడి ఇటుకలు, రాళ్లతో దాడిచేశారు

news18-telugu
Updated: April 15, 2020, 3:36 PM IST
కరోనా అంబులెన్స్, పోలీస్ జీపుపై రాళ్ల దాడి.. వైద్య సిబ్బందికి గాయాలు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, కరోనా పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందిపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయి. ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తున్న డాక్టర్లపై కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయ. తాజాగా యూపీలో మొరదాబాద్‌లో వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బందిపై దాడి చేశారు. ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు సమాచారం అందడంతో వైద్య సిబ్బంది, పోలీసులు అక్కడికి వెళ్లారు. కరోనా అనుమానితులను అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత ఆస్పత్రికి వెళ్లే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున గుమిగూడి ఇటుకలు, రాళ్లతో దాడిచేశారు

ఈ ఘటనలో పలువురు వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. అంబులెన్స్, పోలీస్ వాహనం అందాలు ధ్వంసమయ్యాయి. దాంతో ప్రాణాలరచేత పట్టుకొని సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న ఎఎస్సీ అమిత్ పాఠక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బందిపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటువ్యాధుల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం, సెక్షన్ 144 ఉల్లంఘన కింద కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి కరోనావైరస్‌తో చనిపోయాడు. అప్రమత్తమైన వైద్యాధికారులు మృతుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారిని క్వారంటైన్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా స్థానికులు దాడి చేశారు.

First published: April 15, 2020, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading