కరోనా మహమ్మారితో ప్రపంచం విలవిల్లాడుతోంది. దీని నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలను కొనసాగిస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. మౌత్‌వాష్‌లు మరియు నోటి క్రిమినాశక మందులు కరోనా ప్రభావాన్ని తగ్గిస్తాయని వారి అధ్యయనంలో తేలింది. కోవిడ్–19కు కారణమయ్యే SARS-CoV-2 యొక్క వ్యాప్తిని తగ్గించడంలో మౌత్ వాష్‌లు సహాయపడతాయని ఈ అధ్యయనం పేర్కొంది. కరోనా సంక్రమణ తర్వాత నోటిలో వైరల్ లోడ్ ను తగ్గించడానికి ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయని జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ప్రచురించింది.
అదే విధంగా, అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు కూడా మానవ శరీరంలో కరోనా వైరస్ ను లేకుండా చేయడానికి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో కరోనా సోకిన వారికి మౌత్ వాషర్లను ఇచ్చి పరీక్షించారు. వీటిలో బేబీ షాంపూ, నేటి పాట్, పెరాక్సైడ్ సోర్ మౌత్ క్లీనర్స్ మరియు మౌత్ వాష్‌ల వంటి వాటివి ఉన్నాయి. అయితే, మౌత్ వాష్ లు కరోనా వైరస్ ను మానవ శరీరంలో లేకుండా చేయగల బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఈ పరిశోధనా బృందం కనుగొంది. కోవిడ్–19 పాజిటివ్ ఉన్న వ్యక్తుల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను ఈ ఉత్పత్తుల ద్వారా తగ్గించే అవకాశం ఉందని ఈ పరిశోధనలతో ఒక అంచనాకు వచ్చారు.
30 సెకెన్ల పాటు మౌత్ వాష్ తో కరోనా తగ్గు ముఖం
"వ్యాక్సిన్ తయారీ ఎంత ముఖ్యమో, కరోనా వ్యాప్తిని తగ్గించే పద్ధతులు కూడా అంతే అవసరం. మేము పరీక్షించిన ఉత్పత్తులు ఇదివరకే విస్తృతంగా మార్కెట్లో అందుబాటులో ఉండటమే కాకుండా తరచుగా ప్రజల వారి దినచర్యలలో భాగంగా ఉపయోగిస్తున్నారు." అని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రెయిగ్ మేయర్స్ అన్నారు. నాసికా మరియు నోటి కావిటీస్ అనేవి మానవ శరీరంలో కరోనా వైరస్ ప్రవేశానికి ముఖ్య దారులుగా అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఇందులో భాగంగానే నాసికా మరియు నోటి కుహరాలలో వైరస్ యొక్క పరస్పర చర్యను ప్రక్షాళన చేయడానికి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు.
కరోనా వైరస్ ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని, ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్న వైరస్ అంతమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మానవ శరీరంలో వైరస్ అంతానికి పరిశోధకులు తమ ల్యాబ్ లో వివిధ వైరస్ మౌత్ వాష్ లను ప్రయోగించగా మంచి ఫలితాలొచ్చాయని తెలిపారు. మౌత్ వాష్ మిక్స్ ను సుమారు 30 సెకన్ల పాటు షేక్ చేసి తర్వాత పుక్కిలిస్తే నోటి లోపల ఉన్న క్రిములు నశించి ఇతరుల నుంచి వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధనా బృందం పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published:October 26, 2020, 22:41 IST