సిగరెట్ తాగే వారికి కరోనా సోకితే మరణ మృదంగమే...

సిగరెట్ తాగే వారికి కరోనాతో మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేల్చిచెప్పింది.

news18-telugu
Updated: May 1, 2020, 10:01 AM IST
సిగరెట్ తాగే వారికి కరోనా సోకితే మరణ మృదంగమే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
సిగరెట్ తాగే వారికి కరోనాతో మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేల్చిచెప్పింది. మిగతా వారితో పోలిస్తే పొగతాగేవారిలో కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని తేలింది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు పొగతాగిన వారి, తాగని వారి ఊపిరితిత్తుల కణజాలాల్లో ఉన్న రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా శ్వాసమార్గంలోని వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే ఏసీఈ 2, ఫ్యూరిన్‌, టీఎంపీఆర్‌ఎస్ ఎస్‌ 2 కణజాలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. అసలు పొగతాగని వారితో పోలిస్తే తక్కువలో తక్కువగా 100 సిగరెట్లు తాగిన వారి ఊపిరితిత్తుల కణజాలలు వైరస్ బారినపడే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇది ధూమపాన ప్రియులకు హెచ్చరిక వంటిదేనని ఈ సందర్భంగా అధ్యయనకారులు తెలిపారు.
First published: May 1, 2020, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading