SMARTPHONE GIFT FOR CORONA VACCINATION RAJKOT MUNICIPALITY ANNOUNCED VRY
Smart phone for Vaccination : టీకా వేసుకుంటే రూ.50 వేల స్మార్ట్ ఫోన్ గిఫ్టు..
Smart phone gift for corona Vaccination
Smart phone for Vaccination : కరోనా టీకా వేసుకున్నవారికి 50 వేల రూపాయల స్మార్ట్ ఫోన్ గిఫ్టుగా ప్రకటించారు గుజరాత్‌లోని రాజ్‌కోట్ మున్సిపల్ అధికారులు. ( Smartphone gift for corona Vaccination ) లక్కి డ్రా ద్వారా విజేతకు ఈ బహుమతిని అందించనున్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron ) భయం మరోసారి అటు అధికారులను, ఇటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో కరోనా కట్టడికి శాశ్వత పరిష్కారంగా కరోనా టీకా వేసుకోవడమేనే ఆలోచనలో ఆయా ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో టీకా వేయించడం ద్వారా కరోనా కట్టడి చేయవచ్చని బావిస్తున్నారు.( Smartphone gift for corona Vaccination ) అయితే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంకా యాబై శాతం కూడా టీకావేసుకోని వారు ఉన్నారు. ముఖ్యంగా మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.. కొద్ది రోజుల క్రితం కరోనా ప్రభావం తగ్గడం, ఆయా నిబంధనలను కూడా సడలించడంతో ప్రజలు చాలా ఈజీగా తీసుకున్నారు.
అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' జెట్ వేగంతో ఇప్పటికే 38 దేశాల్లో వ్యాపించిపోయింది. దీంతో భారత్‌లో కూడా ఒమిక్రాన్ ప్రభావం చూపుతుండడంతో.. మూడో ఒమిక్రాన్ కేసు కూడా నమోదైంది. ( Smartphone gift for corona Vaccination ) ప్రపంచవ్యాప్తంగా కంగారు పెట్టేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలోని పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు టీకా వేసుకోవడానికి ముందుకు రాని ప్రభుత్వాలు పలు నజరానాలు కూడా ప్రకటిస్తున్నాయి.
దీంతో గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ మున్సిపాలిటి యూత్‌తో పాటు ఇతరులను ఆకట్టుకునేందుకు టీకా వేసుకున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ( Smartphone gift for corona Vaccination ) రెండో డోసు టీకా తీసుకోనివారే లక్ష్యంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 4 నుంచి 10 మధ్య రెండో డోసు తీసుకున్న లబ్ధిదారులకు స్మార్ట్‌ఫోన్ అందించనున్నట్లు ప్రకటించింది.
Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ
డ్రా నిర్వహించి ఒక లక్కీ విన్నర్‌ను ఎంపిక చేయనున్నట్లు రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అమిత్ అరోడా తెలిపారు. విజేతకు రూ.50 వేల విలువైన స్మార్ట్‌ఫోన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టీకా తీసుకుంటున్న లబ్ధిదారులబ్ధిదారులతో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లకు సైతం నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు అమిత్ వెల్లడించారు. ( Smartphone gift for corona Vaccination ) డిసెంబర్ 4 నుంచి 10 మధ్య ఎక్కువ డోసులు అందించే అర్బన్ హెల్త్‌కేర్ సెంటర్లకు రూ.21 వేలు అందిస్తామని తెలిపారు. రెండో డోసు వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.