గుంటూరు జిల్లాలో ఈ ఆరు రెడ్ జోన్లు... బయటకు రానే రావొద్దు...

గుంటూరు జిల్లాలో ఈ ఆరు రెడ్ జోన్లు... బయటకు రానే రావొద్దు...

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు జిల్లాలో ఆరు ప్రాంతాలను కలెక్టర్ ఆనంద్ కుమార్ రెడ్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ ఆంక్షలను కఠినతరం చేస్తామన్నారు.

 • Share this:
  గుంటూరు జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించామని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు(తురకపాలెం), మంగళగిరి పాంత్రాలను రెడ్‌జోన్లుగా చేశా మన్నారు. రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో శనివారం నుంచి ఆంక్షలు కఠినతరంగా అమలు చేస్తామని చెప్పారు.

  ఆ జోన్లలో ఏ ఒక్కరూ నిత్యావసర సరుకులకు కూడా బయటకు రావడానికి వీల్లేదని తెలిపారు. అధికార యంత్రాంగమే ఆ ప్రాంతాలకు అన్ని సరుకులు తీసుకొచ్చి సరఫరా చేస్తుందని చెప్పారు. వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 20 మందిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. వైద్య, ఇతర సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, సహాయక చర్యల కోసం విరాళాలు ఇచ్చేవారు కలెక్టరేట్‌లో సంప్రదించాలని కోరారు.

  ఉద్యోగులు సైనికుల్లా పోరాడాలి..

  కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతోన్న యుద్ధంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని సైనికుల్లా పోరాటం చేయాలని కలెక్టర్‌ అధికారులను కోరారు. క్వారంటైన్‌ ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరి గిన సమీక్షలో ప్రసంగించారు.. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోన్నం దున ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు.

  వైద్యపరికరాల కొనుగోళ్ళకు రూ.2.50 కోట్లు 

  గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో కోవిడ్‌ 19 అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు రూ.2.50 కోట్లతో వైద్య పరికరాలు కొనుగోలుకు కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ అనుమతు లు జారీ చేశారు. ఎంపీ గల్లా జయదేవ్‌ తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఈ మొత్తా న్ని కేటాయించడంతో ఆమోదం తెలిపారు. జ్వరాల ఆసుపత్రిలో రూ.1.98 కోట్లు, జీజీహెచ్‌కు రూ.51.70లక్షలతో ఎయిర్‌ కంప్రషర్‌, వ్యాక్యూ మ్‌ పంప్స్‌, వెంటిలేటర్లు, ఎన్‌ 95 మాస్కులు, సర్జికల్‌ ఫేస్‌ మాస్కులు, సీపీఈ కిట్లు సర ఫరా చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ కేశవరావును కలెక్టర్‌ ఆదేశించారు. గుంటూరు జిల్లాలో మొత్తం 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు