news18-telugu
Updated: April 30, 2020, 10:00 PM IST
CRPF Jobs: సీఆర్పీఎఫ్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
CRPF(సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్) కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3 కేంద్రంగా పనిచేసే 31వ బెటాలియన్‌లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా మరో ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. వీరిలో ఒకరు జాతీయ కబడ్డీ జట్టు ప్లేయర్ కూడా ఉన్నట్లు తెలిపారు. తాజా కేసులతో సీఆర్పీఎఫ్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52కి చేరింది. బాధితులంతా ఒకే యూనిట్లో పనిచేస్తున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే CRPF బెటాలియన్‌కు చెందిన కరోనా బాధితుల్లో ఒకరు మరణించారు. వరుస కేసుల నేపథ్యంలో 31వ బెటాలియన్ కార్యాలయాన్ని ఢిల్లీ వైద్యాధికారులు సీల్ చేశారు. సిబ్బందిని మొత్తం క్వారంటైన్ చేశారు. గురువారం 89 మందికి పరీక్షలు చేయగా.. ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,823 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 67 మంది చనిపోయారు. తాజా లెక్కలతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,610కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 8,373 మంది కోలుకోగా.. 1,075 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో 24,162 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
April 30, 2020, 9:54 PM IST