Home /News /coronavirus-latest-news /

SINGLE CORONA CASE NOT REGISTERED IN THESE 200 VILLAGES IN TELANGANA BECAUSE OF IMMUNITY POWER FULL DETAILS HERE KNR HSN

Telangana: తెలంగాణలో ఆ ఊళ్లల్లో మాత్రం ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా రాలేదు.. వైద్యులు చెప్తున్న కారణమేంటంటే..!

రాయికల్ తండా గ్రామం (ఫైల్ ఫొటో)

రాయికల్ తండా గ్రామం (ఫైల్ ఫొటో)

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ గ్రామంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. కానీ ఆ 200 ఊళ్లల్లో మాత్రం ఇంత వరకు ఒక్క కేసు కూడా లేదు. కారణమేంటంటే..

  కరోనా సెకండ్ వేవ్ ప్రజలను ఇప్పటికే ఆతలాకుతలం చేస్తోంది. పట్టణాలు గ్రామాలు అంటూ ఏమి తేడా లేకుండా అందరికి కరోనా వ్యాప్తి చెందుతోంది. పట్టణాలలో కానీ, గ్రామాలతో గాని పోల్చుకుంటే తండాలు కరోనా విషయం లో ఆదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ తండాలను చూసి అయినా పట్టణ ప్రజలు. గ్రామ ప్రజల్లో కొంతైనా మార్పురావాలంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని తండాలకు చెందిన ప్రజలకు ఒక్కరికి కూడా కరోనా సోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఎందరికో కనువిప్పు చేస్తున్నాయి. పట్టణ ప్రజలతో పోల్చుకుంటే అన్ని రంగాలలో తండా వాసులు వెనుకంజలో ఉన్నారు. అయినా పలు తండాలు కరోనా విషయంలో ఇప్పటికి అప్రమత్తంగా ఉంటూ ముఖ్యంగా తక్కువ జనాభా ఉన్న పల్లెలు , తండాలు ఈ విషయంలో ఆదర్శంగా నిలస్తున్నాయి.

  సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అడ్డా బోరతండా , దేగావత్ తండా , వీరుని తండా , బడి తండా , రూప్లానాయక్ తండా , చింతామణి తండాల్లో మొదటి , రెండో దశల్లో ఎవరికీ కూడా ఒక్క పాజిటివ్ రాలేదు . ముందు నుంచి ఈ గ్రామాల వాళ్లు కట్టు దిట్టమైన ఆచారాలు ఉండడం పక్క ఊళ్లకు వెళ్లకపోవడం , అనివార్యంగా వెళ్లాల్సి వచ్చినా జాగ్రత్తల్ని తీసుకోవడంతో కరోనా ఛాయలు కనిపించలేదు .ఇలాగే ఇంకా కొన్ని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్ , ఇబ్రహీంపూర్ మండలం భర్తీపూర్ లో ఏ ఒక్కరు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉన్నారు.

  నాలుగు జిల్లాల పరిధిలో 1218 గ్రామ పంచాయతీలు మరో రెండువేల పల్లెలుండగా ఇప్పటివరకు సుమారు 200 కు పైగా ఊళ్లల్లో కరోనారహిత గ్రామాలుగా ఉన్నాయంటే అతియోశక్తి కాదు. ముందు చూపుతో కరోనా కట్టడిలో ఎన్నో గ్రామాలకు, పట్టణాలకు కనువిప్పు చేస్తున్న తండా ప్రజలను శబాష్ అనకుండా ఉండలేము.ఐతే వీరికి కరోనా సోకకపోవడం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. తండా వసూలు ఎక్కువ ఇమ్మ్యూనిటి ఉండే నాన్ వెజ్, దుంపలు, పండ్లు, పకృతి సేద్యం తో పండించిన కూరగాయలు తీసుకోవడం స్వచమైనా పకృతి ఎలాంటి పొల్యూషన్ లేని తండాలు గా ఉండడమే వీరి ఆరోగ్యం నికి పునాదులు అంటున్నారు తండా వసూలు. వీరు అప్పుడప్పుడు అనారోగ్యానికి గురైన సూది మందు వాడరు. అడవిలో లభించే ఔషధ మూలికలు పసరు తాగడం కూడా వీరికి ఎక్కువ ఇమ్మ్యూనిటీ శక్తి ఉండే అవకాశం ఎక్కువ అని వైద్యులు అంటున్నా పరిస్థితి.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Corona cases, Corona positive, Corona second wave, Karimnagar, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు