హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా పై పోరులో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వినూత్న ప్రయోగం..

కరోనా పై పోరులో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వినూత్న ప్రయోగం..

అదే గతేడాది ఆయన చేయించుకున్న బేరియాట్రిక్ సర్జరీ. అంటే బరువు తగ్గడం కోసం చేసే ఓ ఆపరేషన్ అన్నమాట. వయసు పెరిగిపోతుండటంతో బరువు తగ్గకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని భావించిన బాలు.. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.

అదే గతేడాది ఆయన చేయించుకున్న బేరియాట్రిక్ సర్జరీ. అంటే బరువు తగ్గడం కోసం చేసే ఓ ఆపరేషన్ అన్నమాట. వయసు పెరిగిపోతుండటంతో బరువు తగ్గకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని భావించిన బాలు.. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.

SP Balu | ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భాషతో సంబంధం లేకుండా ఆయన  గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. తాజాగా ఈ గాన గంధర్వుడు కరోనాపై పోరులో వినూత్న ప్రయోగానికి రెడీ అయ్యారు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భాషతో సంబంధం లేకుండా ఆయన  గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. ఆయన పాట పంచామృతం.  ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. బాలు  స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. తాజాగా ఈయన కరోనా మహామ్మారిపై వినూత్న ప్రయత్నం మొదలుపెట్టారు. ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ సందర్భంగా సినీ నటులు తమ వంతు ఆర్ధిక సాయం కూడా ప్రకటించారు. ఈ కోవలోనే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినున్నట్టు తన ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి ప్రపంచం ఇంతకు ముందెన్నడు చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలుగారు.. పారిశుద్ధ్య, పోలీస్, డాక్టర్లకు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అందుకోసం శ్రోతలకు, నెటిజన్లను ఛాన్స్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మీకు నచ్చిన పాట పాడమని నన్ను అడగవచ్చు. అది సినిమా గీతమైనా.. భక్తి గీతమైనా ఏదైనా కావొచ్చన్నారు. అందులో ఎవరు ముందుగా అడుగుతారో వారికే ఫస్ట్ ఛాన్స్ దక్కుతుందన్నారు.

వచ్చే శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో ఓ అర్ధ గంట పాటు రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు మీరు కోరిన పాటలు నేను పాడతానన్నారు. రోజు విడిచి రోజు ఎందుకుంటే మీరు కోరిన అన్ని పాటలు నాకు గుర్తు ఉండకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. అందుకోసం నేను ముందుగా కొంచెం ప్రిపేర్ అయి మరుసటి రోజు మీరు కోరిన పాటనుపాడి రికార్డు చేసి వినిపిస్తాను. ఇందుకు గాను రూ.100 చెల్లించాలని కోరారు. ఇంత మొత్తం సేకరించాలన్న లక్ష్యం ఏమి లేదు. అలాగే వచ్చిన సొమ్మును ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూడా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటానన్నారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వాలా ? లేక ముఖ్యమంత్రులు సహాయనిధికి ఇవ్వాలా ? అన్నది మీరే చెప్పవచ్చన్నారు. మీరు ఏ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించాలో తన ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచుతానన్నారు. లావాదేవీలు అన్ని పారదర్శకంగా ఉంటాయన్నారు. అర్ధగంటలో ఓ పాట మొత్తంగా పాడితే నాలుగైదు మించికి రావు కాబట్టి.. అందుకే ఒక పల్లవి.. ఒక చరణం మాత్రమే పాడుతానన్నారు. దీని కోసమై మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను అని బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.

First published:

Tags: Bollywood, Coronavirus, Covid-19, Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood

ఉత్తమ కథలు