కరోనాపై పోరాటానికి శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భారీ విరాళం.. ఎంతంటే?

భారత్‌లో ఇప్పటి వరకు 724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మనదేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కోవిడ్-19 బాధితులు ఉన్నారు. మహారాష్ట్రలో 130కి పైగా కరోనా కేసులు రికార్డయ్యాయి.

news18-telugu
Updated: March 27, 2020, 3:14 PM IST
కరోనాపై పోరాటానికి శిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భారీ విరాళం.. ఎంతంటే?
శిర్డీ సాయిబాబా ఆలయం
  • Share this:
ప్రస్తుతం మనదేశం కష్టాల్లో ఉంది. కరోనామహమ్మారి దెబ్బకు భయంతో వణికిపోతోంది. అన్ని రంగాలూ అస్తవ్యవస్తమయ్యాయి. అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. ఈ గడ్డు పరిస్థితుల్లో దాతలు ముందుకొస్తున్నారు. కరోనాపై పోరాటానికి తమవంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు చేతనైనంత విరాళం అంజేశారు. తాజాగా శిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సైతం భారీగా విరాళం ప్రకటించింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.51 కోట్లు అందజేస్తున్నట్లు తెలిపింది. కరోనాపై పోరాటానిక అందరం చేయి చేయి కలపాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

కాగా, భారత్‌లో ఇప్పటి వరకు 724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మనదేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కోవిడ్-19 బాధితులు ఉన్నారు. మహారాష్ట్రలో 130కి పైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించిన సీఎం ఉద్ధవ్ థాక్రే కరోనాను కట్టడి చేసేందు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దులను కూడా మూసివేశారు. మహారాష్ట్ర బాధితుల్లో ఇప్పటి వరకు 15 మంది కోలుకోగా.. నలుగురు చనిపోయారు.First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading