Telangana: కరోనా విషయంలో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక

కరోనా వ్యాప్తి కారణంగా వచ్చే మూడు నెలలు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌ అన్నారు.

news18-telugu
Updated: November 13, 2020, 4:11 PM IST
Telangana: కరోనా విషయంలో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దీపావళి పండగను దీపాలతో జరుపుకొందామని సూచించారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాణసంచాకు దూరంగా ఉందామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెకెండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ అని మరోసారి కరోనా విజృంభణ గురించి వింటున్నామని... అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో వచ్చేలా మన చేతులారా చేసుకోకూడదని ఆయన అన్నారు. మన ప్రవర్తనను మనమే మార్చుకుందామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తరఫున అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య శాఖ సూచించిన నియమాలు పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని అన్నారు.

కరోనా వ్యాప్తి కారణంగా వచ్చే మూడు నెలలు రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాస్‌ అన్నారు. నవంబర్‌ నెలలో వివాహాలు చాలా ఉన్నాయని.. అయితే వచ్చే మూడు నెలల వరకు వివాహాలే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయని.. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అయితే వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత 8 నెలలుగా పాటిస్తూ వస్తున్న అవే కఠిన నియమాలను వచ్చే జనవరి వరకు కొనసాగించాలని అన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచిస్తున్న అన్ని సూచనలను ఎక్కువ శాతం ప్రజలు పాటిస్తున్నారని.. అయితే ప్రజల్లో కొంత నిర్లక్ష్య వైఖరిని కూడా ఉందని అన్నారు. కొందరు మాస్కులు ధరించడం లేదని... భౌతిక దూరం పాటించడం లేదని అన్నారు. జనం రద్దీ ఉన్న చోట తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: November 13, 2020, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading