Andhra Pradesh: ఈ ధరల పట్టిక చూస్తే షాక్.. కరోనాతో మరణిస్తే ఓ రేటు.. సహజమరణమైతే మరోరేటు.. నగర పాలక సంస్థ బోర్డు

శ్మశాన వాటికలో ధరల పట్టిక

రేషన్ షాపులు, రైతు బజార్లు, కిరణా షాపులు, హోటల్స్ లో సాధరణంగా బోర్డుపై ధరల పట్టిక చూస్తూ ఉంటాం.. ఇప్పుడు శ్మశాన వాటికల ధగ్గర కూడా ధరల పట్టికను పెట్టడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. కరోనా కాలం అంటూ ఆశ్చర్యపోతున్నారు.

 • Share this:
  ఫ్రభుత్వం చెబుతోంది ఒకటైతే.. ఏపీలో స్థానిక పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఆస్పత్రులు, అంబులెన్సుల దందాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. చాలామంది ఆ సమస్యలను ఫేస్ చేసే ఉన్నారు. ఆ కష్టాలన్నీ భరిస్తుంటే.. శ్మశాన వాటికలో దోపిడీ మరీ దారుణంగా ఉంది. ఇటీవల మరణాల రేటు పెరగడంతో రాష్ట్రా వ్యాప్తంగా చాలాచోట్ల అంత్యక్రియలకు భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మృతదేహాలు గ్యాప్ లేకుండా ఒకదాని వెంట ఒకటి వస్తుండడంతో గంటల తరబడి అంత్యక్రియల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడి వారు దోపిడీకి తెరతీశారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి.. అంత్యక్రియలకు సాధారణ రుసుము కన్నాఎక్కువ తీసుకుంటే కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది.

  సాధారణంగా ధరల పట్టిక అనేది హోటల్స్ లోను.. కిరాణా షాపుల్లోను.. టిఫిన్ సెంటర్లలోనూ కనిపిస్తూ ఉంటాయి. అయితే శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ.. ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత.. సాధారణ మరణమైతే ఇంత అంటూ ధరల పట్టిక ఒకటి రాసి శ్మశానం ముందు ఏర్పాటు చేసిన వింత ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ బోర్డు చూసినవాళ్లంతా కరోనా కాలం అంటూ ఆశ్చర్యపోతున్నారు.

  గుంటూరు నగంలోని ఓ శ్మశాన వాటిక అంత్యక్రియలకు ధరలు ఫిక్స్ చేసింది. శ్మశానం ముందు ఉన్న బోర్డు మీద.. పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టారు. కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు చేయాలంటే 5,100 రూపాయలు, సాధారణ మరణానికైతే 2,200 రూపాయలు చెల్లించాలని పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక గోడలపై రాశారు. కానీ ఇలా రాయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  నగరంలోని ఒక్కో శ్మశాన వాటికలో ఒక్కోలా వసూలు చేస్తున్నారని.. దీంతో శ్మశాన వాటికల నిర్వాహకులతో చర్చించి ఉన్నతాధికారులు ఈ ధరలు నిర్ణయించారని నగర పాలక కొవిడ్ మరణాల పర్యవేక్షణాధికారి చెప్పడం దారుణం. అయతే ఈ ధర పట్టిక గురించి నగర పాలక సంస్థకు సంబంధం లేదని కమిషనర్ అనురాధ అంటున్నారు. ఆయా శ్మశాన వాటికల కమిటీల ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోందని.. ప్రజల సౌకర్యార్థం అంత్యక్రియల ఖర్చులను బోర్డులపై ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. పొరపాటున అలా శ్మశాన వాటిక దగ్గర బోర్డు రాయించటంలో పొరపాటు జరిగి ఉంటుందని తెలిపారు.

  కరోనాతో చనిపోయినవారి బంధువులు పట్టించుకోకపోయినా అటువంటి మృతదేహాలకు అంత్యక్రియల బాధ్యత నగరపాలక సంస్థదేనని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకంటామని అనురాధ హెచ్చరించారు. కాగా కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు దహన సంస్కారాలను అవసరమైతే ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఓ పక్కన చెబుతోంది. కానీ నగర పాలక వర్గాలు మాత్రం వారి ఇష్టానుసారంగా చేయటంపై మండిపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: