SHANGHAI COVID SURGE FORCES CITY TO GO INTO PHASED LOCKDOWN PVN
Covid In China : చైనాని కుమ్మేస్తున్న కరోనా..2 ఏళ్లలో తొలిసారి షాంఘైలో లాక్ డౌన్
జిన్ పింగ్(ఫైల్ ఫొటో)
China corona lockdown : చైనాలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ రేటు దాదాపు 87 శాతంగా ఉండగా.. వృద్ధులలో ఇది చాలా తక్కువగా ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 5.2 కోట్ల మంది టీకాలు తీసుకోలేదని సమాచారం.
Lockdown in Shanghai : కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. కొంతకాలంగా రోజు వారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. కొత్తగా 1,219 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కట్టడి చర్యలు ముమ్మరం చేసింది చైనా ప్రభుత్వం. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షలు విధించింది చైనాలోని ఫైనాన్సియల్ హబ్ గా పేరొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే కోవిడ్-19 సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కొవిడ్ విజృంభనను కట్టడి చేయడానికి చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో ఐదు రోజులపాటు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఈ నగరంలో దాదాపు 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు దశల వారీగా లాక్ డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి వీళ్లేదని ఆదేశించారు. ప్రాథమిక దశలోనే కరోనాను కట్టడి చేయడానికి షాంఘై నగరాన్ని అధికారులు రెండు భాగాలుగా విభజించారు. నగర ప్రజలకు మూకుమ్మడి పరీక్షలు నిర్వహించనున్నట్లు షాంఘై అధికారులు ఆదివారం చెప్పారు. కాగా, కరోనా మహమ్మారి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో షాంఘైలో లాక్‌డౌన్ విధించడం ఇదే తొలిసారి. అత్యవసరాలు మినహా మిగతా కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేస్తున్నారు. వాణిజ్యపరమైన లావాదేవీలతో రద్దీగా ఉండే షాంఘైలో నెల రోజుల నుంచీ కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ఇక్కడ లాక్‌డౌన్ విధిస్తే, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందని అధికారులు ఇప్పటివరకు ఆలోచించారు. అయితే, శనివారం రికార్డు స్థాయిలో షాంఘైలో కేసులు నమోదు కావడంతో అధికారులు లాక్‌డౌన్ ప్రకటించారు. ఇక,ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. షాంఘైలోని డిస్నీ థీమ్ పార్క్‌ను సైతం ఇప్పటికే మూసివేశారు.
ఇక మరో కీలక నగరమైన షెన్ జెన్‌లో కూడా లాక్ డౌన్ పరిస్థితులు తలపిస్తున్నాయి. వారం రోజులపాటు షెన్ జెన్ నుంచి సమీప గ్రామాలకు రవాణాపై ఆంక్షలు విధించారు అధికారులు. ఫిబ్రవరి చివరి నుంచి ఇక్కడ కేసులు క్రమంగా పెరుగుతూ రాగా.. ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో కట్టడి చర్యలు ప్రారంభించింది చైనా ప్రభుత్వం. మరోవైపు, చైనాలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ రేటు దాదాపు 87 శాతంగా ఉండగా.. వృద్ధులలో ఇది చాలా తక్కువగా ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 5.2 కోట్ల మంది టీకాలు తీసుకోలేదని సమాచారం.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.