హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Adar Poonawalla: తాము తయారు చేసిన కరోనా టీకా వేయించుకున్న ‘సీరం’ అధినేత అదర్ పూనావాలా

Adar Poonawalla: తాము తయారు చేసిన కరోనా టీకా వేయించుకున్న ‘సీరం’ అధినేత అదర్ పూనావాలా

తమ సంస్థ అభివృద్ది  చేసిన కోవిషీల్డ్ టీకాను వేయించుకుంటున్న సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా

తమ సంస్థ అభివృద్ది చేసిన కోవిషీల్డ్ టీకాను వేయించుకుంటున్న సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ది చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా. తమ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తి మీద ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ రోజు ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ (Vaccination Drive)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా.” అని అన్నారు. ఇక ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో వాడే దేశీయంగా తయారైన కోవిషీల్డ్ (Covishield), కోవాగ్జిన్ (Covaxin)ల టీకా డోసులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించింది కేంద్ర ప్రభుత్వం. తొలిరోజు కరోనా(Corona)పై పోరులో ముందున్న ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయా రాష్ట్రాల్లో టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకాను అందించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా (Adar Poonawalla)కూడా నేడు టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ఖాతా ద్వారా వెల్లడించారు.

“ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. కోవిషీల్డ్ భద్రతా, సమర్థతపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు మా ఆరోగ్య కార్యకర్తలతో పాటు నేను కూడా వ్యాక్సిన్ తీసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, యావత్ భారతావని విజయం సాధించాలని కోరుకుంటున్నా.” అంటూ టీకా తీసుకున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు.

1.1 కోట్ల ‘కోవిషీల్డ్’ డోసులను ఆర్డర్ చేసిన కేంద్రం

ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (Serum Institute of India) తయారు చేసిన ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి 1.1 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది. ఇక హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా పనిచేస్తున్న మరో సంస్థ భారత్ బయోటెక్ (Bharat Biotech).. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో ‘కోవాగ్జిన్’ అనే టీకాను అభివృద్ధి చేసింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 3006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు.

First published:

Tags: Corona Vaccine, Covaxin, COVID-19 vaccine, Covishield, Pm modi

ఉత్తమ కథలు