Oxford Vaccine: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పున:ప్రారంభం

బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా AZD1222 వాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. వాడుక భాషలో ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్‌గా పిలుస్తున్నారు.

news18-telugu
Updated: September 16, 2020, 9:01 AM IST
Oxford Vaccine: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ పున:ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతి ఇచ్చింది. రెండు, మూడో దశలో క్లినికల్‌ ట్రయల్స్ నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. స్క్రీనింగ్‌ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ.. అదనపు సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలని సీరం ఇనిస్టిట్యూట్‌కు సూచించింది. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మనదేశంలో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కానున్నాయి.

బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా AZD1222 వాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. వాడుక భాషలో ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్‌గా పిలుస్తున్నారు. మనదేశంలో ఆ వాక్సిన్‌ ఉత్పత్తికి సీరం ఇన్న‌స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌లో ఇప్పటికే ఈ వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. ఒకటి, రెండో దశ ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఐతే కొన్నిరోజుల క్రితం ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలంటూ ఆర్డర్స్ వచ్చాయి. దీంతో ట్రయల్స్‌ను నిలిపివేశారు.

ఇటీవల బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించారు. వ్యాక్సిన్‌తో ప్రమాదం లేదంటూ రెగ్యులేటరీ నుంచి క్లీన్ చిట్ రావడంతో ట్రయల్స్ పునఃప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ నిర్వహించుకోవడానికి అనుమతి లభించిందని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డీసీజీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టీకా ప్రయోగాలు ముమ్మరంగా సాగనున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 9:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading