India Corona Cases-September: నలభై శాతం కేసులు గతనెలలోనే.. సెప్టెంబర్ లో కరోనా విజృంభణ

Corona Cases: దేశంలో కరోనా ఉధృతి ప్రారంభమైన తర్వాత నమోదైన కేసులతో పోల్చితే.. గతనెలలో కేసులు విపరీతంగా పెరిగాయి. గతంతో పోల్చితే ఏకంగా నలభై శాతానికి పైగా కేసులు సెప్టెంబర్లోనే నమోదు కావడం గమనార్హం.


Updated: October 1, 2020, 11:57 AM IST
India Corona Cases-September: నలభై శాతం కేసులు గతనెలలోనే.. సెప్టెంబర్ లో కరోనా విజృంభణ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:


దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గినట్టుగా కనిపిస్తున్నా... కేసులు మాత్రం రోజుకు  80 వేలకు పైనే నమోదవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలో తొలికేసు నమోదుకాగా.. అప్పట్నుంచి దాని వ్యాప్తి విస్తరిస్తూనే ఉంది. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులలో సెప్టెంబర్లోనే ఎక్కువ కేసులు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం కేసులలో.. ఒక్క సెప్టెంబర్లోనే ఏకంగా 41 శాతం కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేసే అంశం. అంటే ఈ లెక్కన చూస్తే.. గతనెలలో కరోనా  ఏ స్థాయిలో విలయతాండవం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

భారీగా పెరిగాయి..
గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. భారత్ లో ఇప్పటివరకు 63 లక్షల మందికి పైగా ( గురువారం నమోదైన కొత్త కేసులతో కలుపుకుని) ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో 26,24,179 (అంటే 41 శాతం) కేసులు సెప్టెంబర్లోనే వచ్చాయంటే గతనెలలో దీని విలయతాండవం ఎలాగుందో అర్థమవుతున్నది. ఆగస్టులో ఈ వైరస్ వచ్చినవాళ్లు 19,87,705 మంది.
ఎక్కువ మరణాలూ సెప్టెంబర్ లోనే..
ఇక మరణాల విషయంలోనూ గతనెలలోనే ఎక్కువ మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ సోకి సుమారు లక్ష మంది దాకా మరణించగా.. అందులో సెప్టెంబర్ నెలలోనే 33,255 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం మరణాలలో 33.3 శాతం మరణాలు గతనెలలోనివే. సెప్టెంబర్ 1 నుంచి దాదాపు ఇప్పటిదాకా రోజు వేయికిపైగా మంది చనిపోతున్నారు. ఆగస్టులో 28,859 మంది చనిపోగా.. జులైలో 19వేలకు పైగా, జూన్, మే లలో 12 వేల మంది దాకా కన్ను మూశారు.
పెరుగుతున్న రికవరీలు.. అయితే.. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నా.. రికవరీలు పెరుగుతుండటం ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం దేశంలో సుమారు 10 లక్షల లోపే యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ అయినవారు 52 లక్షలకు పైగా ఉన్నారు. రికవరీ రేటు 83 శాతానికి పైగా ఉన్న విషయం తెలిసిందే.
Published by: Srinivas Munigala
First published: October 1, 2020, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading