షాకింగ్.. ICMR సీనియర్ సైంటిస్ట్‌కూ కరోనా పాజిటివ్

ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.

news18-telugu
Updated: June 1, 2020, 2:42 PM IST
షాకింగ్.. ICMR సీనియర్ సైంటిస్ట్‌కూ కరోనా పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత వైద్య పరిశోధనా మండలి..! ఓ వైపు కరోనా కట్టడికి పరిశోధనలు చేస్తూనే.. మరోవైపు వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసే ప్రభుత్వ సంస్థ ఇది. కానీ ఇప్పుడు ICMRలో పనిచేసే ఓ సీనియర్ సైంటిస్ట్ కూడా కరోనా బారిపడ్డారు. ఆయన ముంబైలోని ICMRకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రీప్రోడెక్టివ్‌ హెల్త్‌‌లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఇటీవల ఆయన ముంబై నుంచి ఢిల్లీలోని ICMR హైడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.

గతవారం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవతో పాటు పలువురు శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్న ఓ సమావేశానికి ఈ శాస్త్రవేత్త హాజరయ్యారు. దాంతో అప్రమత్తమైన సిబ్బంది.. ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ ప్రధాన కార్యాలయాన్ని శానిటైజర్ చేశారు. రెండు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు. కేవలం కోవిడ్ 19 కోర్ టీమ్ మాత్రమే ఆపీసుకు వస్తోందని.. మిగిలిన సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ICMR అధికారులు చెప్పారు. ఇక కరోనా బారినపడ్డ ఆ శాస్త్రవేత్త ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు.
First published: June 1, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading