Telangana: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్.. ఆరోగ్యశాఖ మంత్రి ఏమన్నారంటే..

Etela Rajendar: కరోనా విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ తెలిపారు

news18-telugu
Updated: November 21, 2020, 7:43 AM IST
Telangana: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్.. ఆరోగ్యశాఖ మంత్రి ఏమన్నారంటే..
ఈటల రాజేందర్(ఫైల్ ఫొటో)
  • Share this:
దేశంలో తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా వైరస్... మళ్లీ కొన్ని ప్రాంతాల్లో సెకండ్, థర్డ్ వేవ్ రూపంలో పడగ విప్పుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రమాదం మనకు కూడా పొంచి ఉందేమో అనే ఆందోళన పలువురు వ్యక్తం చేశారు. అయితే దీనిపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండకపోవచ్చని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. అయితే కరోనా విషయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి రోజు 50 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు. నిన్న హైటెక్స్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాఠశాలలను ప్రారంభించడానికి ప్రైవేటు యాజమాన్యాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయని, అయితే అందుకు సర్కారు అనుమతి కావాలని ట్రస్మా ప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు.

పిల్లల విద్యపై విశాల దృక్పథంతో ఆలోచించి, అంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలని వారికి మంత్రి సూచించారు. స్కూల్స్‌ను తిరిగి ప్రారంభించే విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్‌ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అవసరమైతే స్కూల్స్‌లోనూ కరోనా పరీక్షలు చేపడతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల ధరలను తగ్గించిన విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేశారు. భవిష్యత్తుల్లో వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Published by: Kishore Akkaladevi
First published: November 21, 2020, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading