Andhra Pradesh: ఏపీకి ఊపిరి.. గుజరాత్ నుంచి గుంటూరుకు చేరుకున్న ఆక్సిజన్ ట్రైన్..

Andhra Pradesh: ఏపీకి ఊపిరి.. గుజరాత్ నుంచి గుంటూరుకు చేరుకున్న ఆక్సిజన్ ట్రైన్..

గుంటూరుకు ఆక్సిజన్

ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. మరో ఆక్సిజన్ ట్రైన్ ను పంపింది. 77 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు కంటైనర్ల ఆక్సిజన్ ట్రైన్ గుజరాత్ నుంచి గుంటూరుకు చేరుకుంది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు మరణాలు పెరుగుతున్నాయి. సెకెండ్ వేవ్ ఊహించన స్థాయిలో స్పెడ్ అవుతోంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత కారణంగానే అనేకమంతి మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సరిపడేలా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలకు యుద్ధ ప్రాతిపధికన ఆక్సిజన్ చేరేలా చేస్తోంది. అక్కడి నుంచి ఆయా రాష్ట్రాల్లో అధికారులు గ్రీన్ ఛాలెంజ్ తో వివిధ జిల్లాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు.

    ఇందులో భాగంగా సెకెండ్ ఆక్సిన్ ఎక్స్ ప్రెస్ ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది. నాలు ఆక్సిజన్ ట్యాంకర్లతో. 76.39 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సమార్థ్యం కలిగిన నాలుగు కంటైనర్లతో కూడిన ఎక్స్ ప్రెస్.. తెల్లవారు జామున గుంటూరుకు చేరుకుంది. గుజరాత్ లోని రెలియన్స్ రైల్ టెర్నినల్ నుంచి 14వ తేదీ రాత్రి 8.30 గంటలకు బయలు దేరిన ట్రైన్.. మొత్తం 1854 కిలోమీటర్లు ప్రయాణించి గంటకు 58.85 కిలోమీటర్ల వేగంతో 31 గంటల 30 నిమిషాల్లో గుంటూరుకు చేరుకుంది.

    గుంటూరు నుంచి వివిధ జిల్లాలకు ఆక్సిజన్ ను అధికారులు సరఫరా చేయనున్నారు. రాష్ట్రానికి 910 టన్నుల ఆక్సిజన్ అవసరమని సీఎం జగన్ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. వివిధ మార్గాల్లో కేంద్ర ఆక్సిజన్ పంపిస్తోంది. రెండు రోజుల కిందట విశాఖకు ఓ ఆక్సిజన్ ట్రైన్ వచ్చింది. ఏపీలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు తొలిసారి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ప్లాంట్‌ నుంచి.. సుమారు 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను నింపుకొని ఏపీకి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఆక్సిజన్‌ను విశాఖపట్నం, నెల్లూరులో స్టేషన్లలో అన్‌లోడ్ చేశారు. ప్రాణవాయువు అవసరాలు తీర్చేందుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రావడం అదే తొలిసారి. రాష్ట్రంలో రోజుకు దాదాపు 600 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతున్నప్పటికీ.. రోడ్డు మార్గాల ద్వారానే తమిళనాడు, ఒడిశా నుంచి సరఫరా అవుతోంది. తాజాగా రవాణా సమయాన్ని తగ్గించేలా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వేశాఖ సమ్మతించింది.

    తాజాగా గుజరాత్ నుంచి రెండో ట్రైన్ గుంటూరుకు చేరింది. ఈ ట్యాంకర్ల పంపిణీ పర్యవేక్షణ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చూస్తున్నారు. గుంటూరు నుంచి మూడు జిల్లాలకు పంపిస్తున్నామన్నారు అధికారి కృష్ణబాబు. గుంటూరుతో పాటు ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లాలకు గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, కృష్ణ జిల్లాలకు తరలిస్తామన్నారు. అయితే గుంటూరు నుంచి.. ఒక పద్థిలో ఆక్సిజన్ ను ఇతర జిల్లాలకు సరఫరా చేస్తమాని.. వివిధ జిల్లాల్లో ఆక్సిజన్ కొరత.. అవసరాల బట్టి ఒక కమిటీని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు