కరోనాతో చైనాకు కనువిప్పు.. అక్కడా కుక్క మాంసంపై నిషేధం

చైనాలో మాంసం కోసం ప్రతి ఏటా దాదాపు కోటి కుక్కులను చంపుతుంటారు. అక్కడి ప్రజల్లో దాదాపు 20శాతం మంది కుక్క మాంసాన్ని తరచూ ఆహారంగా తీసుకుంటారు.

news18-telugu
Updated: April 17, 2020, 6:03 PM IST
కరోనాతో చైనాకు కనువిప్పు.. అక్కడా కుక్క మాంసంపై నిషేధం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరనా బారినపడ్డ దేశాలన్నీ చైనాపై గుర్రుగా ఉన్నాయి. మీ వల్లే మాకు ఈ కష్టాలంటూ జనం మండిపడుతున్నారు. అడ్డమైన తిండి తినడం వల్లే కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. అన్నింటినీ పచ్చిగా పీక్కుతినడం వల్లే కరోనా వ్యాధి వచ్చిందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. కరోనా వైరస్ కనిపించదు కాబట్టి బతికిపోయిందని.. లేదంటే దాన్ని కూడా కరకరా నమిలేవారంటూ సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు నెజిజన్లు. కరోనా నేపథ్యంలో చైనాను అంతగా తిట్టుకుంటున్నారు జనం. ఐతే కరోనా నేర్పిన పాఠాలతో చైనా కూడా క్రమంగా కళ్లు తెరుస్తోంది. కుక్క, పిల్లి సహా పలు జంతువుల మాంస విక్రయాలపై నిషేధం విధిస్తోంది. ఇప్పటికే షెన్‌జెన్ నగరంలో కుక్క మాంసం విక్రయాలు, తినడంపై నిషేధం విధించారు. తాజాగా జుహాయ్ నగరంలోనూ కుక్క, పిల్లితో పాటు పలు వన్యప్రాణుల మాంసంపై నిషేధం విధించింది అక్కడి అధికార యంత్రాంగం.

చైనాలోని వుహాన్ సిటీలో కరోనా వైరస్ పుట్టిందనే విషయం తెలసిందే. అక్కడి ఓ సముద్ర జీవుల మార్కెట్ ద్వారా ప్రజలకు సంక్రమించిందనే ప్రచారం ఉంది. ఇలా ప్రతి జంతువునూ తినడం, అది కూడా సరిగ్గా ఉడకకుండానే తినడం వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నాయనే అభిప్రాయాలు వినిపించాయి. దానికి తోడు జంతు ప్రేమికులు కూడా చైనా తీరుపై ఉద్యమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చైనాలోని పలు రాష్ట్రాలు, నగరాల అధికార యంత్రాంగాలు దిగొస్తున్నాయి. గత వారం కుక్క మాంసంపై చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహార శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కను మాంసం కోసం కాకుండా.. పెంపుడు జంతువుగా పరిగణిస్తున్నట్లు తొలిసారి ప్రకటించింది. షెంజెన్‌లో కుక్క మాంసాన్ని భుజించడంపై నిషేధించిన విధించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ క్రమంలో తాజాగా జుహాయ్‌లోనూ కుక్క, పిల్లి మాంసంపై నిషేధం విధించారు. ఐతే అల్పాకా, ఆస్ట్రిచ్, సిల్వర్ ఫాక్స్, రాకన్ డాగ్‌ను స్పెషల్ లైవ్ స్టాక్‌గా పరిగణిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. చైనాలో మాంసం కోసం ప్రతి ఏటా దాదాపు కోటి కుక్కులను చంపుతుంటారు. అక్కడి ప్రజల్లో దాదాపు 20శాతం మంది కుక్క మాంసాన్ని తరచూ ఆహారంగా తీసుకుంటారు. ఐతే 2016లో చేసిన ఓ సర్వేలో దేశవ్యాప్తంగా కుక్క మాంసాన్ని నిషేధించాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. కాగా, జుహాయ్‌లో కుక్క, పిల్లి మాంసంపై నిషేధం విధించడాన్ని జంతు ప్రేమికులు స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని..మిగతా రాష్ట్రాలు, నగరాలు కూడా ఇదే బాటలో వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: April 17, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading