హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron : ఒమిక్రాన్ లాక్‌డౌన్ షురూ -ముంబైలో సెక్షన్ 144 విధింపు -గుంపులుగా తిరిగితే అంతే..

Omicron : ఒమిక్రాన్ లాక్‌డౌన్ షురూ -ముంబైలో సెక్షన్ 144 విధింపు -గుంపులుగా తిరిగితే అంతే..

ఒమిక్రాన్ వ్యాప్తితో ముంబైలో సెక్షన్ 144 విధింపు

ఒమిక్రాన్ వ్యాప్తితో ముంబైలో సెక్షన్ 144 విధింపు

సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలి తీసుకున్న డెల్టా వైరస్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ఇండియాలోనూ కలకలం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ దెబ్బకు లాక్ డౌన్ పరిస్థితులు మళ్లీ తలెత్తాయి. మహారాష్ట్రలో, ప్రత్యేకించి ముంబైలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సిటీ వ్యాప్తంగా సెక్షన్ 144 విధించారు. జనం గుంపులుగా తిరగడం, సభలు, సమావేశాలు జరపడాన్ని నిషేధించారు. కేసుల పెరుగుదలను బట్టి ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు..

ఇంకా చదవండి ...

భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒమిక్రాన్ కలకలం రేపుతున్నది. కరోనా వైరస్ తొలి వేవ్ నుంచీ అత్యధిక కేసులు, అత్యధిక మరణాలకు కేంద్రంగా ఉన్న ముంబై నగరం ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు కూడా హాట్ స్పాట్ గా మారింది. విదేశీ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ముంబైలోనే ఒమిక్రాన్ కేసులు అధికంగా బయపటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా ఏడు కేసులు రావడం, ముడున్నరేళ్ల చిన్నారికి కూడా ఒమిక్రాన్ సోకడంతో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. కొత్త వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై నగరం అంతటా ఆంక్షలు విధించింది. ముంబై వ్యాప్తంగా సెక్షన్ 144 అమలు విధించినట్లు ప్రభుత్వం శనివారం ఉదయం ప్రకటన చేసింది.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ముంబై నగరంలో విధించిన సెక్షన్ 144 శని, ఆదివారాల్లో కొనసాగనుంది. కొత్త కేసుల ఉధృతిని బట్టి ఆంక్షలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ముంబై సిటీలో ఇవాళ్టి నుంచి ర్యాలీలు, సభలు, గుంపులుగా నిర్వహించే ఏ కార్యక్రమాలకూ అనుమతి ఉండదు. ప్రజలు ఒకే చోట ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించారు. ఈ మేరకు ముంబై డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

IAF chopper crash : చిత్తూరుకు జవాన్ సాయితేజ భౌతికకాయం -మరో ఐదుగురివీ గుర్తింపు -డీఎన్ఏ టెస్టులతోదేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు పెరగడం, అందులో ఏకంగా 17 కేసులు మహారాష్ట్ర నుంచే రావడం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అందులో మూడు ముంబై నుంచి, మిగతా నాలుగు పింప్రీ చించ్వాడ నుంచి నమోదయ్యాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. డిసెంబర్ 1 నుంచి ముంబై, పుణె, నాగపూర్ ఎయిర్ పోర్టుల నుంచి 61వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు మహారాష్ట్రకు వచ్చారు. అందులో 10వేల మంది.. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారే కావడంతో వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరుతుందా? అనే భయాలు పెరిగాయి.

Omicron : మూడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్ -దేశంలో తొలిసారి పిల్లలకూ వ్యాప్తి -పరిస్థితి ఎలా ఉదంటే..కాగా, భారత్ లో గుర్తిగిన 32 ఒమిక్రాన్ కేసుల్లో ప్రభావం స్పల్పంగానే ఉందని, ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మాస్క్ ధారణ, భౌతిక దూరం తప్పనిసరిగా అమలు చేస్తుండగా, ఇప్పుడు ముంబైలో ఏకంగా 144 సెక్షన్ విధించడం పరిస్థితికి అద్దంపడుతున్నది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వ్యాప్తిని బట్టి ఆంక్షలు పెరిగే అవకాశాలున్నాయి.

First published:

Tags: Coronavirus, Covid, Maharashtra, Mumbai, Omicron, Omicron corona variant

ఉత్తమ కథలు