కరోనా మహమ్మారిపై పోరాటానికి WHO సలహాలు సూచనలు ఇవే ...

డబ్యూహెచ్ఓ అందించే సూచనల ఆధారంగా వ్యాధి నిరోధక చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్యం సంస్థ ఇచ్చిన సలహాలు చూడండి..

news18-telugu
Updated: April 20, 2020, 5:45 PM IST
కరోనా మహమ్మారిపై పోరాటానికి WHO సలహాలు సూచనలు ఇవే ...
ప్రతకాత్మకచిత్రం
 • Share this:
అంటువ్యాధుల ఆట కట్టించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్ర ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక దేశాలు.. డబ్యూహెచ్ఓ అందించే సూచనల ఆధారంగా వ్యాధి నిరోధక చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్యం సంస్థ ఇచ్చిన సలహాలు చూడండి..


 • మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోండి.

 • మద్యం చక్కెర పానీయాలను పరిమితం చేయండి.

 • ధూమపానం చేయవద్దు. ఇది COVID-19 లక్షణాలను పెంచుతుంది. తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

 • పెద్దలకు రోజుకు కనీసం 30 నిమిషాలు, పిల్లలు రోజుకు ఒక గంట వ్యాయామం చేయండి.

 • మీకు బయటికి వెళ్ళడానికి అనుమతి ఉంటే.. నడక, పరిగెత్తడం లేదా బైక్ రైడ్ వెళ్తే ఇతరులకు దూరంగా ఉండాలి.
 • మీరు ఇంట్లో ఉండే డ్యాన్స్ చేయండి.. కొంత యోగా చేయండి లేదా మెట్లు పైకి క్రిందికి నడవండి.

 • ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు ఒకే స్థానంలో ఎక్కువసేపు కూర్చోకూడదు.

 • ప్రతి 30 నిమిషాలకు 3 నిమిషాల విరామం తీసుకోండి.

 • సంక్షోభం నుండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సంగీతం వినండి, పుస్తకం చదవండి లేదా ఆట ఆడండి.

 • సంక్షోభ సమయంలో ఒత్తిడి, గందరగోళం భయపడటం సాధారణం.

 • మీకు తెలిసిన నమ్మదగిన వ్యక్తులతో మాట్లాడటం సహాయపడుతుంది

 • మీకు ఆత్రుతగా ఉంటే ఎక్కువ వార్తలు చదవడానికి లేదా చూడటానికి ప్రయత్నించకండి.

 • రోజుకు ఒకటి లేదా రెండుసార్లు నమ్మదగిన సోర్సు నుంచి వార్తా సమాచారాన్ని పొందండి.

Published by: Krishna Adithya
First published: April 20, 2020, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading