Home /News /coronavirus-latest-news /

SCIENTISTS HOPING THAT MIXING OF COVAXIN AND COVISHIELD WILL FIGHT AGAINST DANGEROUS VARIANTS FULL DETAILS HERE PRN GH

Vaccine Mixing: వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌కు నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్‌.. శాస్త్రవేత్తలు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Vaccination: కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం.. కోవిడ్ వ్యాక్సిన్లు. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం.. కోవిడ్ వ్యాక్సిన్లు. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్‌ల మిక్సింగ్ విషయంపై అధ్యయనాలు చేపట్టాయి. భారతదేశంలో కూడా 2 వేర్వేరు కరోనా వ్యాక్సిన్‌లు ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సెంట్రల్ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ ‌(సీడీఎస్‌సీఓ)కు సంబంధించిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ).. వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌పై చర్చ జరిపింది. ఈ చర్చలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను మిక్సింగ్ చేయడం పట్ల ఎస్ఈసీ సానుకూలంగా స్పందించింది. అలాగే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మిక్సింగ్‌పై క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి అనుమతి మంజూరు చేయాలని సీడీఎస్‌సీఓ కి సిఫార్సు చేసింది.

వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌పై అధ్యయనాలు:
టీకాలు మిక్సింగ్ చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయో తీసుకోవడానికి.. స్పానిష్ కాంబివాక్స్ ట్రయల్ నిర్వహించారు. ఇందులో 600 మందికిపైగా పాల్గొన్నారు. వీరంతా తొలుత ఓ ఆస్ట్రాజెనెకా టీకా డోస్ తీసుకున్నారు. తర్వాత మూడింట రెండు వంతుల మంది ఫైజర్‌ టీకాను రెండు డోసుగా తీసుకున్నారు. ఆస్ట్రాజెనెకా టీకా మాత్రమే తీసుకున్న వారితో పోల్చితే.. 2 డోసులూ తీసుకున్న వారిలో 37 రెట్లు ఎక్కువగా కోవిడ్ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని ప్రాథమిక ఫలితాల్లో తేలింది. అలాగే, 2 డోసులు తీసుకున్నవారిలో 4 రెట్లు ఎక్కువగా కోవిడ్ ప్రత్యేక రోగనిరోధక కణాలను అభివృద్ధి అయ్యాయని వెల్లడైంది.

2 వేర్వేరు వ్యాక్సిన్‌లు తీసుకున్న భారత ప్రజలు:
ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ కి చెందిన 20 మంది ప్రజలు 2వేర్వేరు కరోనా వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. మొదటి డోసుగా కొవిషీల్డ్‌.. 6 వారాల తర్వాత రెండవ డోసుగా కొవాగ్జిన్‌ తీసుకున్నారు. వీరిలో ఇప్పటివరకూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు.

మిక్సింగ్‌కు అనుమతి ఇచ్చిన దేశాలు:
తొలి డోస్ ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నట్లయితే.. రెండవ డోసుగా వేరే టీకా తీసుకోవచ్చని కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్పెయిన్, దక్షిణ కొరియా ప్రకటించాయి. 28 రోజుల గ్యాప్ తో ఫైజర్, మోడర్నా టీకాలు తీసుకోవచ్చని అమెరికా ప్రభుత్వం కూడా తెలిపింది.

వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌పై నిపుణుల అభిప్రాయం:
కరోనా ప్రోటీన్లకు అడినోవైరస్లను జతచేసి ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్‌ తయారు చేశారు. మరోవైపు, కొవాగ్జిన్‌ ని క్రియారహిత లేదా చనిపోయిన కరోనా వైరస్ ఉపయోగించి అభివృద్ధి చేశారు. కావున ఇవి రెండూ వేరే విధంగా పనిచేస్తాయని.. వేరే విధంగా తయారవుతాయని.. రోగనిరోధక ప్రతిస్పందనను వేరే విధంగా ప్రారంభిస్తాయని జాస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రోహన్ సీక్వేరా తెలిపారు. అయితే డెల్టా వేరియంట్లను కూడా మిశ్రమ వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని ప్రముఖ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Purna Chandra
First published:

Tags: Corona Vaccine, Covaxin, Covishield

తదుపరి వార్తలు